ముంబై కోర్టు నుండి ఉగ్రవాది అఫ్జల్ ఉస్మాని పరారీ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మోకా కోర్టు నుంచి ఉగ్రవాది అఫ్జల్ ఉస్మాని తప్పించుకున్నాడు. అతడు 2008 అహ్మదాబాద్, సూరత్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. పరారైన ఉఫ్జల్ ఉస్మాని అరెస్టుకు మోకా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అఫ్జల్ ఉస్మాని ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన తీవ్రవాది. ఇతనిని విచారణ నిమిత్తం ముంబై మోకా కోర్టుకు పోలీసులు తీసుకు వచ్చారు. మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత అతను కనిపించకుండా పోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

అఫ్జల్ ఉస్మానిని పోలీసులు 2008లో అరెస్టు చేశారు. అహ్మదాబాదులోని పేలుళ్లలో ఇతని పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూరత్ బాంబు పేలుళ్ల యత్నానికి పాల్పడిన ఘటనలోను ఇతని పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications