బీ అలర్ట్ : శ్రీనగర్ జైలు నుండి ఆగ్రా జైలుకు కరడుగట్టిన ఉగ్రవాదుల తరలింపు
జమ్ము కశ్మీర్‌లో శుక్రవారం నుండి సాధరణ జనజీవనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే శ్రీనగర్‌లో జైల్లో ఉన్న సుమారు 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులతోపాటు కశ్మీర్ వేర్పాటు వాదులను ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జైలుకు తరలించినట్టు సమాచారం. మరోవైపు ప్రధాని మోడీ కూడ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్న సంధర్భంలో కూడ ఎలాంటీ హింసాత్మక చర్యలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు, విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నుండి ప్రజలను త్వరగా బయటపడేందుకు కేంద్రం చకచక పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎక్కువ రోజులు నిర్భంధం కొనసాగించకుండా సాధరణ జనజీవనాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న భద్రతా చర్యలను సడలించింది. దీంతోపాటు కేంద్ర,రాష్ట్ర ఉద్యోగులు విధులకు హజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో కరుడు గట్టిన ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను శ్రీనగర్ జైలు నుండి ఆగ్రా జైలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో తరలించినట్టు సమాచారం.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్గిస్తున్న ఆర్టికల్ 370,35ఏలను రద్దు చేయడంతోపాటు కశ్మీర్ విభజించడంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టింది. కశ్మీర్ పరిణామాల్లో ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా దళాలను పంపించిన అనంతరం అక్కడి విద్యాలయాలను, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. కాగా రెండు రోజుల నుండి జనజీవనం స్థంభించింది. కాగా రెండు రోజులుగా బంద్ వాతవరణం కొనసాగిన నేపథ్యంలోనే ఎలాంటీ అసాంఘీక చర్యలకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలను రెచ్చగొట్టే ఉగ్రవాదులు, పాకిస్థాన్ ప్రత్యేక వాదులను ముందుగా అక్కడి నుండి తరలించింది.












Click it and Unblock the Notifications