CM vist: సీఎం పర్యటన రోజే కుక్కర్ బాంబు పేలుడు స్కెచ్, టార్గెట్ ఎవరు ? జస్ట్ మిస్, లేదంటే ?
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళూరులో అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ బాంబు పేలుడుకు పెద్ద స్కెచ్ వేశాడని. అయితే చివరి నిమిషాల్లో ఆ స్కెచ్ రివర్స్ అయ్యిందని అధికారులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంగళూరు పర్యటించిన రోజే అదే సిటీలో కుక్కర్ బాంబ్ పేలుడు జరగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కుక్కర్ బాంబు పేలి ఉంటే ఊహించని నష్టం జరిగిఉండేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు అంటున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

స్కెచ్ రివర్స్
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థ హళ్లిలో నివాసం ఉంటున్న మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటోలో షారిఖ్ కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో అది మధ్యలోనే పేలిపోయింది.

షారిఖ్ ఎక్కడికి వెళ్లమని చెప్పాడు ?
షారిఖ్ కుక్కర్ బాంబు పేల్చడానికి వేరే ప్రాంతం ఎంచుకుని ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో అనుమానిత ఉగ్రవాది షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షారిఖ్ ఏ ప్రాంతానికి వెళ్లాలి అని ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారికి చెప్పాడు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

సీఎం పర్యటన రోజే కుక్కర్ బాంబు స్కెచ్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఈనెల 19వ తేదీన మంగళూరులో పర్యటించారు. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంగళూరులో వివిద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్యాహ్నంకు సీఎం బసవరాజ్ బోమ్మయ్ మంగళూరు పర్యటన పూర్తి అయ్యింది. అదే రోజు రాత్రి మంగళూరులో కుక్కర్ బాంబు పేలిపోయింది.

షారిఖ్ వచ్చింది సాయంత్రం
ఈనెల 19వ తేదీన మైసూరులో కుక్కర్ బాంబుతో బస్సులో బయలుదేరిన షారిఖ్ అదే రోజు సాయంత్రం మంగళూరుకు చేరుకున్నాడు. అయితే అప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంగళూరు నుంచి వెళ్లిపోయారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.

బీజేపీ ప్రభుత్వం టార్గెట్
ఎందుకంటే సీఎం బసవరాజ్ బోమ్మయ్ వెళ్లిపోయిన తరువాత షారిఖ్ మంగళూరు వచ్చాడు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని టార్గెట్ చేసుకోకపోయినా ఉగ్రవాదులు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కుక్కర్ బాంబు పేలుడుకు స్కెచ్ వేశారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టార్గెట్ జస్ట్ మిస్.... లేదంటే ?
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కుక్కర్ బాంబు పేలి ఉంటే ఊహించని నష్టం జరిగిఉండేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు అంటున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. కుక్కర్ బాంబు పేలుడుతో తీవ్రగాయాలైన షారిఖ్ మాట్లాడే పరిస్థితిలో లేడని, అతను కోలుకున్న తరువాత అతన్ని విచారణ చేస్తామని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ శశికుమార్ అంటున్నారు.












Click it and Unblock the Notifications