సరిహద్దుల్లో కాల్పులు, హోరా హోరీ - భారీగా బలగాలు, విమానాలు..!!
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వద్ద రెచ్చగొట్టేలా కాల్పులకు తె బడింది. భారత సైన్యం వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. రెండు దేశాల ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. అటు క్షిపణి పరీక్షలు జరుగుతున్నాయి. భారత్ దౌత్య చర్యలకు ప్రతిగా పాక్ తమ నిర్ణయాలను ప్రకటించింది. రెండు దేశాల సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తున్నారు. వాయు సేనలు సమాయత్తం అవుతున్నాయి. అటు పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ప్రతీ క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రధాని హెచ్చరిక
భారత్ పైన దాడికి పాల్పడిన వారికి ఉపేక్షించేది లేదని ప్రధాని హెచ్చరించారు. కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. అటు ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారానికి భారత ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం జమ్ము కశ్మీర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దాడి నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ లోభద్రతా పరిస్థితిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించనున్నారు. శ్రీనగర్‌లో భద్రతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉగ్ర దాడి జరిగిన బైసరన్ వ్యాలీని సైతం ఆయన సందర్శించనున్నారు. కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి స్థానిక సైనిక విభాగాల అగ్ర కమాండర్లు ఆర్మీ చీఫ్ కి వివరించనున్నారు.

బలగాల మొహరింపు
పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్‌ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్‌ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 70 కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాన్ని కూల్చేసింది. ఈ మేరకు నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పిలుస్తారు. మరోవైపు, అరేబియా సముద్రంలో విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ తన గస్తీని మొదలుపెట్టింది. కర్ణాటకలోని కార్వార్ పోర్టు సమీపంలో విక్రాంత్ గస్తీని ముమ్మరం చేసినట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాలను బట్టి తెలుస్తున్నది. పహల్గాం దాడి నేపథ్యంలోనే నేవీ యుద్ధ నౌకలను మోహరించింది.
ఉద్రిక్తతల వేళ
భారత నావికాదళానికి చెందిన పూర్తి స్వదేశీ యుద్ధనౌక INS సూరత్ క్షిపణిని అరేబియా సముద్రంలోని లక్ష్యంపై విజయవంతంగా ప్రయోగించింది. సముద్ర-స్కిమ్మింగ్ లక్ష్యాన్ని చేధించింది. ఈ పరీక్ష భారత నావికాదళం వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం వైపు మరో బలమైన అడుగు పటినట్లైంది. INS సూరత్ అనేది భారత నావికాదళంతాజా గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. ఇది పూర్తిగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక. ఈ నౌకలో ఆధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించడం ద్వారా ఇది తన సామర్థ్యాలను ప్రదర్శించింది.












Click it and Unblock the Notifications