వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

గౌహతి: స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అసోంలో సైకిల్ బాంబులతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి చాల రోజుల నుండి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇచ్చారు.

అసోం ప్రభుత్వం అన్ని జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించిందని ఆ రాష్ట్ర డీజీపీ ఖాగెన్ శర్మ తెలిపారు. ఉల్ఫా తీవ్రవాదుల ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు. సైకిళ్లకు ఐఈడీ (బాంబు)లు అమర్చి పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ వేశారు.

The Assam government has sounded a high alert across the state

ఈ దాడులలో నేరు ఉగ్రవాదులు పాల్గోనకుండా స్థానికంగా ఉంటున్న చోటా చోటా నేరగాళ్లను, సానుభూతిపరులను ఉపయోగించుకోవాలని వారు ప్లాన్ వేశారని పోలీసు అధికారులు అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు దాడులు చేయ్యాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.

గతంలో కూడ సైకిళ్లు, ఇతర వాహనాలకు ఐఈడీలు అమర్చి రద్దిగా ఉన్న ప్రాంతాలలో పేలుళ్లకు పాల్పడిన సందర్బాలు ఉన్నాయని డీజీపీ ఖాగెన్ శర్మ అంటున్నారు. ముందు జాగ్రత చర్యగా అసోంలోని అన్ని జిల్లాలలో ఉన్న సైకిల్ షాప్ ల యజమానులకు గుర్తు తెలియన వారికి సైకిళ్లు అద్దెకు ఇవ్వరాదని స్థానిక పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Militants in Assam may use petty criminals to explode bombs concealed in bicycles ahead of Independence Day, police sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X