ప్రతిపక్షాలకు పనిపాట లేదు, నకిలి లెటర్ హెడ్స్ లో నకిలి సంతకాలు !
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కుమారుడు ప్రియాంక్ ఖార్గే పై ఆలంద ఎమ్మెల్యే బీఆర్. పాటిల్ పేరుతో బీజేపీ తప్పుడు ఆరోపణలు చేసిందని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఓటమి నిరాశలో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు తమ నకిలీ ఫ్యాక్టరీలకు మరింత పని కల్పించాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ప్రజలకు అందిస్తున్న ఆదరణను తట్టుకోలేక విపక్షాలు నకిలి లెటర్ హెడ్ ల సృష్టికి పూనుకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అది బీజేపీ నాయకుల మూర్ఖత్వమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు బీఆర్. పాటిల్ పాత ఇంటి చిరునామాకు సంబంధించిన నకిలీ లెటర్‌హెడ్‌పై నకిలీ లేఖను సృష్టించి విజయం సాధించాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బాధలను వినేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీఆర్. పాటిల్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతి పత్రాన్ని అక్రమంగా వక్రీకరించి ఆ నకిలీ లేఖను చింపివేశారన్నారు. ఈ లేఖలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రియాంక్ ఖార్గే పై కొన్ని ఆరోపణలు గుప్పిస్తున్నారని, చాకచక్యంగా అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది.
లీక్ అయిన ఈ లేఖ తమది కాదని, మేము ఇచ్చిన లేఖకు, ఈ లేఖలోని అంశాలకు ఎలాంటి సంబంధం లేదని, ఫోటో షాప్ ద్వారా ఈ నకిలీ లేఖపై నా సంతకం స్కాన్ చేశారని, ఈ నకిలీ లేఖలో నా పాత ఇంటి చిరునామా కూడా రాసి ఉందని, లేఖను డిజిటల్ ఫార్మెట్ తో టైప్ చేసి తరువాత నా సంతకం స్కాన్ చేసి, సంతకం కోసం జిరాక్స్ లెటర్ ఉపయోగించారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ అన్నారు.

ఈ ఉత్తరం నాది కాదు. నేను రాసింది కాదని, అధికారిక అక్షరాలపై ఆర్డర్ నంబర్ డిఫాల్ట్‌గా ముద్రించబడిందని, ఇది ఫేక్ లెటర్ అనడానికి ఇది సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్. పాటిల్ స్పష్టం చేశారు. నాకు, మంత్రి ప్రియాంక్ ఖర్గేకి మధ్య రిలేషన్ దెబ్బ తియ్యడానికి ఇలా కుట్రలు జరిగినట్లు తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్, పాటిల్ ఆరోపించారు.
తన లెటర్ హెడ్ తో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలబురిగి జిల్లా ఎస్పీకి తాను ఇప్పటికే ఫిర్యాదు చేశానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్. మీడియాకు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మొదలైన వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందో అని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications