అమ్మ విజయం ఘనం: 1.6 లక్షల మెజారిటీ

చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో జయలలిత 1.6 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆమె ప్రత్యర్థుల మీద మెజారిటితో ముందుకు దూసుకు వెళ్లారు.

15వ రౌండ్ నుండి 17వ రౌండ్ వరకు జయలలిత ఏకపక్షంగా మెజారిటి సాధించారు. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు కేవలం 8,875 ఓట్లు వచ్చాయి. జయయలిత గెలుపుతో తమిళనాడులో ఆమె అభిమానులు పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు.

చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రకియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. నగరంలోని రాణిమేరీ కాలేజ్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్నికల అధికారులు, అన్నాడీఎంకే, సీపీఐల ఏజెంట్లు ఓట్ల లెక్కింపును పరిశీలించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత, సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ ల మధ్య గట్టి పోటి ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే గెలుపు ముఖ్యం కాదని, ఎంత మెజారిటి వస్తుంది అని వారు ఎదురు చూస్తున్నారు.

జయలలిత, మహేంద్రన్‌లతో పాటు కాంగ్రెస్, బీజేపీతో సహా 26 మంది స్వతంత్ర అభ్యర్థులు ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో పోటీ చేశారు. జూన్ 27వ తేదిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరిగాయి. 74.4 శాతం పోలింగ్ జరిగింది. ఎక్కువ శాతం తెలుగు వారు నివాసం ఉంటున్న ఆర్ కే నగర్ లో అన్నాడీఎంకే పార్టీకి ఓట్లు వేశారని సమాచారం.

The counting of votes in bypolls in RK Nagar started at 8 am today.

ఆర్ కే నగర్ లోని వన్నార్ పేటలో ఓటర్ల సంఖ్య కంటే పోలింగ్ ఎక్కువ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నానికి పోలీంగ్ ఫలితాలు వెలువడుతాయని సమాచారం. ముందు జాగ్రత చర్యగా రాణిమేరీ కాలేజ్ పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

జయలలితకు 53,000 మెజారిటి, బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్ కు 11,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్. శబరినాథన్ కు 6,444 ఓట్ల మెజారిటి వచ్చింది, సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు డీలాపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+