couple: రాత్రి ఇంట్లోకి వెళ్లారు, మూడు రోజుల తరువాత దంపతులు ?, ఇంట్లో ఏం జరిగింది ?
చెన్నై/టీ నగర్: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. రాత్రి దంపతులు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో మాట్లాడి తరువాత వారి ఇంటికి వెళ్లారు. తరువాత దంపతులు కనపడలేదు. మూడు రోజులు దంపతులు ఇద్దరూ కనపడకపోవడంతో ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. దంపతుల నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా దంతులు ఇద్దరూ వాళ్లు నివాసం ఉంటున్న ఇంటిలోనే శవమై కనిపించారు. ఇంటి నుంచి దుర్వాసన వచ్చే వరకు మ్యాటర్ బయటకు రాలేదు.

13 ఏళ్ల క్రితం పెళ్లి
చెన్నై సిటీలోని పులియంతోపు శాస్త్రినగర్ 6వ వీధిలో శక్తివేల్ (45), అతని భార్య తులుకన్నం (35) నివాసం ఉంటున్నారు. శక్తివేల్, తులుకన్నం దంపతులకు 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. చెన్నై సిటీలోని మంగాడువార్డులో ఇద్దరూ కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రతిరోజు దంపతులు ఇద్దరూ ఒకేసారి ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు.

దంపతులకుపిల్లలు లేరు..... రాత్రి ఇంటికి వెళ్లారు
వివాహం జరిగి 13 ఏళ్లు దాటినా శక్తివేల్ దంపంతులకు సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరి మద్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఆదివారం రాత్రి శక్తివేల్ దంపతులు ఇంటికి వెళ్లారు. రాత్రి శక్తివేల్ దంపతులు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో మాట్లాడి తరువాత వారి ఇంటికి వెళ్లారు.

ఊరికి వెళ్లారని అనుకున్నారు
తరువాత శక్తివేల్ అతని భార్య ఎవ్వరికి కనపడలేదు. మూడు రోజులు శక్తివేల్ దంపతులు ఇద్దరూ కనపడకపోవడంతో ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. శక్తివేల్ దంపతుల నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ల పులియంతోపు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శక్తివేల్ అతని భార్య ఇద్దరూ వాళ్లు నివాసం ఉంటున్న ఇంటిలోనే శవమై కనిపించారు.

శవాలు కుళ్లిపోయాయి
ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా శక్తివేల్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. శక్తివేల్ దంపతుల శవాలు కుళ్లిపోయిన స్థితిలో మంచం మీదపడి ఉన్నాయి. అనంతరం పులితోపు పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతానం లేదనే మనస్తాపంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంటున్నారు.

ఇంట్లో ఏం జరిగింది ?
శక్తివేల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అతని భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. శక్తివేల్ భార్య తులుకన్నం ఎలా చనిపోయింది అని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. సంతానం లేదనే మనస్తాపంతో శక్తివేల్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications