Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోర్టులో విచారణ ఖైదీని పోలీసుల ముందే కాల్చి చంపేశారు, పక్కా సినిమా స్టైల్లో హత్య !

నేరాలు చేసి ఒక్కసారి జైలుకు వెళ్లి వచ్చిన తరువాత చాలా మందిలో మార్పు వస్తుంది. నేరాలు చేసి జైలుకు వెళ్లడం ఎందుకు అంటూ సైలెంట్ గా ఉండిపోయేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే హత్య, దోపిడీలు, లూటీలు, రేప్ కేసుల్లో జైలుకు వెళ్లిన చాలా మందిలో ఏమాత్రం మార్పు రాదు. హత్య కేసులో జైల్లో ఉన్న వ్యక్తి కోర్టు విచారణ కోసం కోర్టుకు వచ్చాడు. పోలీసు బందోబస్తు మధ్యలో ఉన్న ఆ నేరస్తుడిని కోర్టు ఆవరణంలోనే కుక్కను కాల్చినట్లు కాల్చి చంపేశారు.

ఓ హత్య కేసులో అరెస్టు అయ్యి విచారణలో ఉన్న నిందితుడిని కోర్టు ఆవరణంలో పోలీసుల ముందే కాల్చి చంపిన షాకింగ్ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. హత్య చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

 The criminal who came to the court was shot dead with revolvers in front of the police in Patna.

అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్ అలియాస్ అభిషేక్ భాయ్ అనే వ్యక్తి పట్టపగలు కోర్టు ఆవరణంలో పోలీసులు, కోర్టులో రద్దీగా ఉన్న ప్రాంతంలో హత్యకు గురి కావడంతో పాట్నా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.

హత్యకు గురైన అండర్ ట్రయల్ ఖైదీ అభిషేక్ కుమార్ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్‌లోని సికందర్‌పూర్‌లో నివాసముంటున్న అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్ మీద హత్య కేసుతోపాటు పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల నేపథ్యంలో అరెస్టు అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని బేయర్‌ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు.

బీహార్ రాజధాని పాట్నాలోని ధన్‌పూర్‌లోని కోర్టుకు శుక్రవారం ఓకేసుకు సంబంధించి అభిషేక్ కుమార్ ను కోర్టులో విచారణ కోసం పిలుచుకుని వచ్చారు. విచారణ ఖైదీకి జైలు సిబ్బందితో పాటు పాట్నా పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. అయితే ఆసమయంలో దుండగులు ఒక్కసారిగా అభిషేక్ కుమార్ మీద విరుచుకుపడ్డారు. పోలీసులు కళ్లుమూసి తెరిచేలోపు ప్రత్యర్థులు నేరస్తుడు అభిషేక్ కుమార్ ను కోర్టు ఆవరణంలో పోలీసుల కళ్ల ముందే కాల్చి చంపారు.

ధన్‌పూర్ కోర్టుకు అభిషేక్ కుమార్ ను తీసుకువస్తుండగా ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులు జరిపారని, అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పాట్నా పశ్చిమ విభాగం ఏఎస్పీ రాజేష్ కుమార్ మీడియాకు చెప్పారు. హత్య జరిగిన స్థలం నుంచి 4 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అభిషేక్ కుమార్ ను అతని ప్రత్యర్థులు హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

కేసు విచారణలో ఉన్నందున నిందితుల పేర్లు చెప్పడానినికి వీలుకాదని, త్వరలో పూర్తి వివరాలు చెబుతామని ఏఎస్పీ రాజేష్ కుమార్ మీడియాకు చెప్పారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అభిషేక్ కుమార్ ను హత్య చేసిన ఇద్దరు నిందితులు ముజఫర్‌పూర్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+