కరోనా విస్పోటనం - ఒక్క రోజులో 50 వేల కేసులు : మహారాష్ట్రలో కట్టు తప్పుతోంది- రాష్ట్రాల వారీగా...!
భారత్ లో మరోసారి కరోనా విస్పోటనం మొదలైంది. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఓమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్న వేళ... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. ఒకే రోజున ఆ రాష్ట్రంలో 18 వేల కేసులకు పైగా నమోదు కాగా.. ఒక్క ముంబాయిలోనే పది వేల కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఢిల్లీ లో కేసుల తీవ్రత కారణంగా వారాంతపు కర్ఫ్యూ ప్రకటించారు.
Recommended Video

ఒక్క రోజులోనే 50వేల కేసులకు పైగా
ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 147.62 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముంబయిలో మంగళవారం ఒక్కరోజే 10 వేల 860 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా మహారాష్ట్రలో 18,466 మందికి వైరస్ సోకింది. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరింది. దేశ రాజధాని దిల్లీలోనూ కొవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్తగా 5,481 మంది వైరస్ బారినపడ్డగా... పాజిటివిటి రేటు 8.37 శాతానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో 9,073 మందికి వైరస్ సోకింది. 3,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 16 మంది వైరస్ కారణంగా చనిపోయారు.

ముంబాయిలో అదుపు తప్పుతోంది
కేరళలో 3,640 కొత్త కేసులు.. ప్రభుత్వం సవరించిన దాని ప్రకారం 453 మరణాలు సంభవించాయి. అయితే మంగళవారం ఒక్కరోజు 30 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,49,489కి చేరింది. ఇప్పటివరకు 48,637 మంది కొవిడ్‌కు బలయ్యారు.తమిళనాడులో కొత్తగా 2,731 మందిలో వైరస్ నిర్ధరణ అయ్యినట్లు అధికారికంగా వెల్లడించారు. 9 మంది చనిపోయారు. 674 మంది కోలుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్యం 12,412 గా నమోదైంది. గుజరాత్లో కొత్తగా 2,265 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 240 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

కర్ణాటక - తమిళనాడులోనూ భారీగా నమోదు
ఇద్దరు చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 7,800 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్ణాటకలో కొవిడ్ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో 2,479 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 30,13,326, మరణాలు 38,355కు చేరాయి. నార్త్ బంగాల్లో మెడికల్ కాలేజీలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ లూథియానాలోని డీఎంసీ నర్సింగ్ కాలేజీలో 41 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

కర్ప్యూలు - ఆంక్షల అమలు
వీరిలో 23 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, సామాజిక, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్‌లు, సరిహద్దుల్లో వైరస్ పరీక్షలు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రిలో పడకలను, మందులను సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమేణా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,52 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications