పాక్ తో చర్చల్లో బిగ్ ట్విస్ట్, ప్రధాని పట్టు - అనూహ్య పరిణామాలు..!!

భారత్ - పాక్ చర్చల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరగాల్సి ఉంది. మధ్నాహ్నం 12 గంటలకు ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. ఇదే సమయంలో ప్రధాన మోదీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. చర్చల వేళ తన వైఖరిని తేల్చి చెప్పారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందనకు అనుగుణంగానే నడుచుకోవాలని త్రివిధ దళాలకు ప్రధాని స్పష్టం చేసారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో, చర్చల వేళ తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

మోదీ కీలక సమీక్ష
ఇండో, పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశం వాయిదా పడింది. ఈ మధ్నాహ్నం 12 గంటలకే జరగాల్సిన భేటీ అనూహ్యంగా వాయిదా వేసారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, పాక్‌ చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈరోజు రక్షణ ఉన్నతాధికారులతో ప్రధాని నిర్వహించిన రెండో కీలక భేటీ ఇది. ఇలా వరుస భేటీలతో పాక్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు మోదీ పదును పెడుతున్నారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. పాక్ ను పూర్తిగా ఫిక్స్ చేసే లక్ష్యంతోనే చర్చలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

the-dgmo-level-talks-post-poned-amid-pm-modi-hold-hi-level-meeting

భారత్ కీలక డిమాండ్లు
రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ, కొనసాగిం , ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాగా, ఈ చర్చల సమయంలో భారత్ తమ డిమాండ్స్ ఏంటనేది తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ కోసం భారత్ ప్రధానితో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాట్లాడిన సమయంలోనే కొన్ని అంశాల పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించా లనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో పీఓకే ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

Take a Poll

పాక్ మళ్లీ రెచ్చగొడితే
కాల్పుల విరమణ నిర్ణయం తరువాత భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రెచ్చగొట్టే చర్యలకు దిగింది. డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. భారత సైన్యం వాటిని ధీటుగా తిప్పి కొట్టింది. ఇక, ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారతదేశం స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ తెలిపింది. ముందస్తు, తదుపరి షరతులు లేకుం నే చర్చలు జరగాలని భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ వేళ జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి స్పష్టం చేసేందుకు సిద్దం అవుతోంది. ఉగ్రవాదుల విషయంలో భారత్ కఠినం ఉంటామనే సంకేతాలు ఇవ్వనుంది. ఇదే సమయంలో పాక్ లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులను అప్పగించే అంశం పైన భవిష్యత్ లోనూ పట్టుబట్టాలని భావిస్తోంది. దీంతో, చర్చలకు ముందే భారత్ డీజీఎంఓ మీడియా సమావేశంలో తమ వైఖరి స్పష్టం చేయనున్నారు. దీంతో, ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+