పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
జైపూర్: రాజస్థాన్ లో ఫ్లాట్ ఫాంలో రైలు పట్టాలు తప్పింది. ఒక్క సారిగా రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు హడిలిపోయారు. విషయం గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
చెన్నై నుంచి రాజస్థాన్ లోని జైపూర్ ల మద్య ప్యాసింజర్ రైలు సంచరిస్తుంది. ఎప్పటిలాగే చెన్నయ్ నుంచి జైపూర్ కు రైలు బయలుదేరింది. గురువారం ఉదయం రైలు జైపూర్ ఫ్లాట్ ఫాం దగ్గరకు చేరుకున్న సమయంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది.

ప్రయాణికులు హడలిపోయి కేకలు వేశారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అర్దగంట పాటు కష్టపడి ఇంజిన్ ను పట్టాలు ఎక్కించారు. ఇంజిన్ రెండు చక్రాలు పట్టాలు తప్పడం వలనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో సుమారు 45 నిమిషాలు పలు రైళ్ల సంచారం స్థంభించింది.












Click it and Unblock the Notifications