పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!
పండుగ వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్ను భారీగా తగ్గించింది. పశ్చిమాసియా లో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. కొరత కొనసాగుతున్న వేళ కేంద్రం ఉపశమన చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. దీనికి ముందుగానే ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
వాహనాల వినియోగ దారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన రూ 10 రూపాయల మేర ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తో ఇప్పుడు వీటి ధరల తగ్గింపు పైన ఆయిల్ కంపెనీలు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. పెట్రోల్ పై ఉన్న రూ 13 రూపాయల సుంకాన్ని రూ 3కి తగ్గించిన కేంద్రం.. డీజిల్ పైన ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని ద్వారా పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గటం ఖాయంగా కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ... కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించే సమావేశం లోనూ రాష్ట్రాల పరిధిలోనూ పన్నులు తగ్గించే అంశం పరిశీలించాలని సూచించే అవకాశం ఉంది.

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. వంట గ్యాస్ టాక్స్ లపై నిర్ణయం
అటు ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్రం.. ఉత్పత్తి మెరుగు పడిన తరువాత వాటిని తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో పన్ను శాతం తగ్గింపు పైన పరిశీలన చేయాలని కేంద్రం సూచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించటంతో.. రాష్ట్రాల పరిధిలోనూ కొంత మేర తగ్గించే అవకాశం పరిశీలనకు వస్తోంది. దీంతో.. పెరిగిన ధరలు కొంత మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు కేంద్రం అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గించటంతో.. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications