లవర్‌తో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు
ప్రపంచంలో కొన్ని కథలు కేవలం ప్రేమతో మొదలై, భయంతో ముగుస్తాయి. దశాబ్దాల క్రితం ముగిసిపోయిన ఓ స్నేహం, మళ్లీ చిగురించి, అక్రమ సంబంధంగా మారి, చివరకు ఒకరి ప్రాణాన్ని బలిగొని, చైనాలో కోర్టు తీర్పు ద్వారా సంచలనం సృష్టించిన హృదయ విదారక గాథ ఇది.
1980లలో చైనాలోని ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేసిన ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు. కాలక్రమేణా ఎవరి జీవితాలు వారివిగా మారిపోయాయి. అయితే, 2023లో జరిగిన ఒక సామాజిక కార్యక్రమంలో వారిద్దరూ అనుకోకుండా మళ్లీ కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలు, కొత్త అనుబంధంగా మారి, కొద్దికాలంలోనే వారిని వివాహేతర సంబంధానికి దారితీసింది. కుటుంబాలకు తెలియకుండానే వారిద్దరూ రహస్యంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు.

ఈ రహస్య సంబంధంలో భాగంగా, 2024 జూలై 24న వారు ఒక హోటల్ గదిలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె గది బుక్ చేసి వేచి ఉండగా, అతడు అక్కడికి చేరుకున్నాడు. రాత్రంతా కలిసే గడిపారు. కానీ... మరుసటి రోజు ఉదయం ఆమె నిద్ర లేచి చూసేసరికి పక్కన పడుకున్న వ్యక్తి నిర్జీవంగా, చలనం లేకుండా ఉన్నాడు. ఈ భయంకర దృశ్యంతో ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం చేయాలో తెలియని అయోమయంలో, భయంతో వెంటనే గది నుండి బయటకు పరుగులు తీసింది.
కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని తిరిగి వచ్చి చూస్తే, గది తలుపు లోపలి నుండి లాక్ అయి ఉంది. చివరకు హోటల్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి చూసేసరికి అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆమె వెంటనే ఎమర్జెన్సీ సేవలకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. వైద్యులు వచ్చి పరీక్షించి, అతను అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు.
కుటుంబ పెద్ద మరణవార్తతో పాటు అతని రహస్య సంబంధం గురించి తెలుసుకున్న మృతుడి కుటుంబం కుప్పకూలింది. అతని మరణానికి ఆమె నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆ మహిళపై కోర్టులో దావా వేశారు. విచారణ మొదట్లో ఆమె రూ.67 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, కేసును క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది.మృతుడి మరణానికి ప్రధాన కారణం అతని అనారోగ్య సమస్యలే అని, ఈ విషయంలో ప్రియురాలికి నేరుగా బాధ్యత లేదని తేల్చింది. అయినప్పటికీ, ఆమె భయంతో వెంటనే సహాయం కోసం కేక వేయకుండా లేదా సిబ్బందిని పిలవకుండా ఆలస్యం చేసి, గది నుండి పారిపోయింది. సరైన సమయంలో స్పందించి ఉంటే అతని ప్రాణం కాపాడే అవకాశం ఉండేదని కోర్టు అభిప్రాయపడింది.
ఆమె అనైతిక ప్రవర్తన , సమయానికి స్పందించకపోవడంలో నిర్లక్ష్యం కారణంగా, కోర్టు నష్టపరిహారాన్ని రూ.7.5 లక్షలకు తగ్గించి, ఆ మొత్తాన్ని మృతుడి కుటుంబానికి చెల్లించాలని తుది ఆదేశాలు జారీ చేసింది. ఈ విషాద సంఘటన... రహస్య సంబంధాల వల్ల ఏర్పడే భావోద్వేగ , న్యాయపరమైన ప్రమాదాన్ని మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications