అక్రమ సంబంధం, భార్య తల నరికి చేతిలో పట్టుకుని నేరుగా నడుచుకుంటూ వెళ్లిన భర్త, క్లైమాక్స్ !

వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే భార్య కాని, భర్త కాని పరాయి వ్యక్తుల మోజులో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తోందని మరోసారి వెలుగు చూసింది. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య మీద పగపెంచుకున్న భర్త ఆమె శరీరాన్ని, తనను రెండుగా ముక్కలు చెయ్యడం కలకలం రేపింది.

ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 35 ఏళ్ల వ్యక్తి అతని భార్యను హత్య చేసి, కత్తిరించిన తలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు అర్జున్ బాఘా తన భార్యను ముక్కలుగా నరికేసి కత్తిరించిన తలతో బనిగోచా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇది చూసిన ప్రజలు, పోలీసు స్టేషన్‌లోని సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.

The husband surrendered at the police station after beheading his wife who had an illicit relationship

బిడపాజు గ్రామానికి చెందిన బాఘా తన భార్య ధరిత్రి అలియాస్ ధరి(30)ని హత్య చేశాడు. భార్య ధరిత్రికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు భఱ్త అర్జున్ పోలీసులకు తెలిపాడు. భార్య ధరిత్రిని హతమార్చి, ఆపై పదునైన ఆయుధంతో ఆమె తలను చేతిలో పట్టుకుని దర్జాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు, భార్య ధరిత్రిని హత్య చేసిని అర్జున్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అలాగే తల లేని ధరిత్రి మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనేక కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు బనిగొచ్చ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్ దండసేన స్థానిక మీడియాకు తెలిపారు.

The husband surrendered at the police station after beheading his wife who had an illicit relationship
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన సోదరి తలను నరికి దానిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఘటన కూడా జరిగింది.ఈ ఏడాది జూలైలో యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది.ఫతేపూర్ జిల్లా మిత్వారా గ్రామంలో ఓ యువకుడు తన సోదరి తలను నరికి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం రియాజ్ (22) అనే యువకుడు అతని సోదరి ఆషిఫా (18)ను హత్య చేశాడు. ఆసిఫాకు అక్రమ సంబంధం ఉందనే విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత ఆసిఫా దారుణ హత్యకు గురైయ్యిందని పోలీసులు తెలిపారు.

రియాజ్ పదునైన ఆయుధంతో సోదరి ఆసిఫా తల నరికాడు. అనంతరం ఆసిఫా తలను తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్లాడు. అయితే స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి రియాజ్ ను పోలీస్ స్టేషన్‌కు చేరుకోకముందే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ మిశ్రా ధృవీకరించారు.ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకోగా ఇప్పుడు ఒడిశాలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+