ఇన్ స్టాగ్రామ్ రీల్స్, అక్రమ సంబంధాలు, భార్యను చంపేసి శవం ఏం చేశాడంటే ? మామతో !
బెంగళూరు/మండ్య: భార్య మొబైల్ ఫోన్ మీద మోజు పెంచుకోవడంతో ఆమె హత్యకు అదే మొబైల్ కారణమైన ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్న భార్య మొబైల్ వ్యామోహంతో ఆమె ప్రాణాల మీదకు తెచ్చిపెట్టుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తునకన భార్య ఆమె మగ స్నేహితులతో చాటింగ్ చెయ్యడం, అర్దరాత్రి గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న విషయం ఆమె భర్త గమనించాడు.
భార్యకు మొబైల్ ఫోన్ వ్యామోహం, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వ్యామోహం పట్టుకోవడంతో ఆమె భర్తకు అనుమానం వచ్చింది. తన భార్య ఇతర మగాళ్తతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఎంజాయ్ చేస్తోందని, అందుకే తనను నిర్లక్షంగా చూస్తోందని భర్త రగిలిపోయాడు. భార్యను హత్య చెయ్యడానికి ఆమె కన్న తండ్రి అల్లుడికి సహకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు ఫోన్‌ను కూడా అతిగా మాట్లాడుతున్న పూజా ఆమె భర్త శ్రీనాథ్ వస్తే మాత్రం మొబైల్ ఫోన్ పక్కన పెట్టేస్తున్నది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. పూజాకు అక్రమ సంబంధం ఉందని ఇటీవల శ్రీనాథ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో పూజాతో ఆమె భర్త గొడవ పడుతున్నాడు.

అల్లుడు శ్రీనాథ్ అతని భార్య పూజా మృతదేహాన్ని మోసుకెళ్లేందుకు అతని మామ (పూజా కన్నతండ్రి) సహకరించాడని పోలీసుల విచాణలో వెలుగు చూడటం కలకలం రేపింది. అల్లుడు శ్రీనాథ్ తో కలిసి కూతురు పూజా మృతదేహాన్ని కావేరీ నదిలో పడేశారు. మరుసటి రోజు పూజా హత్య గురించి ఆమె సోదరుడు, బావమరిది శేఖర్‌కు ఫోన్ చేసిన శ్రీనాథ్ జరిగిన విషయాన్ని పిన్ టూ పిన్ చెప్పాడు.

కూతురు పూజా హత్య విషయం తెలిసినా ఆమె తండ్రి పోలీసులకు చెప్పలేదు. పూజా మృతదేహాన్ని మామా, అల్లుడు శ్రీనాథ్ ఇద్దరూ బైక్‌పై ఇంటి నుంచి తీసుకెళ్లారు. మృతదేహాన్ని భారీ రాళ్లు, కట్టి కావేరి నదిలో పడేశారు. ఒక్కరోజు పూజా మృతదేహాన్ని శ్రీనాథ్ ఇంట్లోనే ఉంచాడు. తరువాత మామను ఇంటికి పిలిపించి చర్చలు జరిపిన తరువాత పూజా శవాన్ని ఇద్దరు కలిసి మాయం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
శేఖర్ అతని కూతురు పూజా మృతదేహాన్ని నదిలో పడేసి హోటల్ పనిలో నిమగ్నమయ్యాడు. భార్య పూజాను హత్య చేసిన తరువాత ఆమె భర్త శ్రీనాథ్ నిమిషాంబ గుడికి వెళ్లేందుకు బయలుదేరారు. దేవుడి దర్శనం అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన శ్రీనాథ్ తన భార్య పూజాను హత్య చేశానని, తాను లొంగిపోతున్నట్లు సమాచారం అందించారు. పూజా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించిన మామ శేఖర్ గురించి కూడా పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం ఆరెకెరె పోలీసులు శ్రీనాథ్, పూజా తండ్రి శేఖర్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications