ఆంధ్రా లిక్కర్ పరువు తీసేసిన పక్క రాష్ట్రం మంత్రి, మన మందుతో పోల్చుకుంటే ? !
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లిక్కర్ (మద్యం)తో పోల్చుకుంటే కర్ణాటకలో నాణ్యమైన, బ్రాండెడ్ లిక్కర్ చిక్కుతుందని, మన మద్యం వలన ఎవ్వరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కర్ణాటకలో లభ్యం అయ్యే లిక్కర్ బ్రాండ్ ఎగుమతి చేసుకోవడానికి మార్కెట్ లో, ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందని కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి తిమ్మాపూర్ అన్నారు.
కర్ణాటకకు ఇతర ప్రాంతాల నుంచి మద్యం దిగుమతిని మేము అడ్డుకుంటున్నామని కర్ణాటక శాఖా మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ అన్నారు. రాయచూరు జిల్లా సింధనూరులో విలేకరులతో మాట్లాడిన కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి తిమ్మాపూర్ మద్యం నాణ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పేర్లు చెబుతూ అక్కడి మద్యం నాణ్యత సరిగా లేదని రెండు రాష్ట్రాల పరువు తీసేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు అక్రమంగా మద్యం తరలిస్తే కేసులు పెడుతున్నామని, అక్రమ మద్యం తరలించే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తిమ్మాపూర్ హెచ్చరించారు. మంత్రి తిమ్మాపుర్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టడంపై వ్యాఖ్యానించారు. మద్యం విక్రయాలు పెరిగితే నష్టపోయేది ఎవరు? మద్యం ధర పెంచడం మంచిదేనా కదా? ధరలు పెరిగాయని తాగుబోతుల సంఖ్య పెరుగుతుందా ? లేఖ తగ్గుతుందా? అంటూ మంత్రి తిమ్మాపుర్ మీడియాను ప్రశ్నించారు.

మద్యం ధరలు పెరిగితే తాగుబోతుల సంఖ్య తగ్గుతుందని మంత్రి తిమ్మాపూర్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపులకు లైసెన్స్ లు ఇవ్వడం లేదని, కర్ణాటకలో లభ్యం అవుతున్న మద్యం నాణ్యతగా ఉందని మంత్రి అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల రాష్ట్రాల్లోని మద్యం నాణ్యత పరిశీలిస్తే కర్ణాటక రాష్ట్రంలో నాణ్యమైన లిక్కర్ అందుబాటులో ఉందని కర్ణాటక మంత్రి తిమ్మాపూర్ చెప్పారు.












Click it and Unblock the Notifications