International Labour day 2024: మే డే చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి..?

ఏటా మే 1వ తేదీన మేడే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకుంటాం.మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం ఒకటైతే రెండవది సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం. అసలు కార్మిక దినోత్సవం ఎలా పుట్టుకొచ్చింది... దీని చరిత్ర ఏంటి..?

కార్మిక దినోత్సవం చరిత్ర

కార్మిక దినోత్సవం యొక్క మూలాలు మనకు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1 మే 1886లో దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఎనిమిది గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాదు చక్కటి పనివాతావరణాన్ని కల్పించడం,తక్కువ వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. షికాగోలో హిసాత్మకంగా మారింది. షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏం చేసేదిలేక ప్రభుత్వం దిగొచ్చి 1894లో కార్మిక దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఆరోజు సెలవుదినంగా ప్రకటించింది.1916లో తొలిసారిగా రోజుకు 8 పని గంటలు మాత్రమే అన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

The Legacy Lives On International Labor Day 2024 Explained

1917లో రష్యా విప్లవం తర్వాత, సోవియట్ యూనియన్ మరియు తూర్పు కూటమి దేశాలు మే డేను వేడుకలు చేపట్టాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పతనంతో,క్రమంగా మే డే వేడుకలు తగ్గుతూ వచ్చాయి.భారత్‌లో మొదటిసారిగా కార్మిక దినోత్సవాన్ని 1923 మే 1వ తేదీన జరుపుకోవడం జరిగింది. అదేరోజున లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్తాన్ అనే రాజకీయ పార్టీ చెన్నైలో ఏర్పాటు చేసి కార్మికుల దినోత్సవాన్ని జరిపింది.కార్మికుల కృషిని పురస్కరించుకుని మే 1వ తేదీని జాతీయ సెలవుదినంగా పరిగణించాలని కమ్యూనిస్టు నాయకుడు మలయపురం సింగారవేలు చెట్టియార్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ రోజును హిందీలో "కామ్‌గర్ దిన్" అని, కన్నడలో "కార్మికర దినచరనే" అని, మరాఠీలో "కమ్‌గర్ దివస్" అని మరియు బెంగాలీలో "ష్రోమిక్ దిబోష్" అని పిలుస్తారు.

కార్మిక దినోత్సవం ప్రాముఖ్యత

దేశ నిర్మాణంలో కార్మికుల యొక్క కృషి కొనియాడదగినది. దేశ నిర్మాణంలో వారు చేసిన కృషి గణనీయమైనదని చెప్పాలి.కార్మిక దినోత్సవం రోజున వారు చేసిన కష్టాన్ని లేదా శ్రమను గుర్తిస్తూ వారి హక్కుల గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో వారు శ్రమదోపిడీకి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం, వారు పురోగతి సాధించేందుకు తోడ్పాటు ఇచ్చినట్లవుతుంది.

వేడుకలు

అనేక దేశాల్లో కార్మిక దినోత్సవం రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. భారత్‌లో కూడా మే 1వ తేదీన జాతీయ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.కార్మికులు,శ్రామికులు వారు సాధించిన విజయాలను గురించి గర్వంగా ఈ రోజు చెప్పుకుంటారు. ఇందులో భాగంగా చాలా చోట్ల పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల సెమినార్లు కూడా నిర్వహించి అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే కార్మికుల హక్కులను తెలియజేస్తూ పోస్టర్లను ప్రదర్శించడం, ర్యాలీలు చేపట్టడం వంటివి చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+