తన రికార్డును తానే చెరిపేసుకున్న మోదీ: నెహ్రూ మొదలుకుని ఏ ప్రధాని ఎంత సేపు మాట్లాడారంటే..?

దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.

పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారాయన. ఆపరేషన్ సింధూర్ మొదలుకుని సంక్షేమ పథకాల అమలు వరకు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు.

The Longest I-Day Speech by Any Prime Minister PM Modi s 103-Minute Address

ఈ క్రమంలో అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించారు. 103 నిమిషాల పాటు మాట్లాడారు. ఇది దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత సుదీర్ఘంగా ప్రసంగించలేదు. రెడ్ ఫోర్ట్ పై నుంచి ప్రధానులు చేసిన ప్రసంగాలన్నింటిలోకెల్లా అత్యంత సుదీర్ఘమైనది ఇదే.

ఈ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టారు మోదీ. గత ఏడాది 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయ 98 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పటివరకు అదే రికార్డు. దీన్ని తిరగరాశారు మోదీ. అంతకుముందు ఆయన సుదీర్ఘ ప్రసంగం 2016లో నమోదైంది. 96 నిమిషాల పాటు మాట్లాడారు. అతి తక్కువ ప్రసంగం 2017లో 56 నిమిషాలు.

అలాగే- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నెలకొల్పారు. ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు ప్రసంగించారు. ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. రెండో ప్రధానిగా చరిత్ర నెలకొల్పారు. ఆయన కంటే ముందు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు. నెహ్రూ వరుసగా 17 సార్లు ప్రసంగించారు.

మోదీ తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని 2014లో 65 నిమిషాల్లో ముగించారు. 2015లో ఆయన 88 నిమిషాలు, 2018లో 83 నిమిషాల పాటు మాట్లాడారు. 2019లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2020లో 90, 2021లో 88, 2022లో 74, 2023లో 90 నిమిషాల పాటు మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కొనసాగింది.

జవహర్‌లాల్ నెహ్రూ 1947లో 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఇంద్రకుమార్ గుజ్రాల్ 1997లో 71 నిమిషాలు ప్రసంగించి అప్పటివరకు సుదీర్ఘ ప్రసంగాల రికార్డులను నెలకొల్పారు. నెహ్రూ 1954లో 14 నిమిషాలు, ఇందిరా గాంధీ 1966లో 14 నిమిషాల చొప్పున అతి తక్కువ నిడివి గల ప్రసంగాలను చేశారు.

మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల్లో కొన్ని అతి తక్కువ నిడివి గలవిగా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ 2012లో 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు ప్రసంగించారు. వాజ్‌పేయి ప్రసంగాలు 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాలతో ఇంకా తక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+