ఈ టైమ్ లో స్టే ఎలా ఇస్తాము ?, హైకోర్టు దెబ్బకు మాజీ మంత్రి మైండ్ బ్లాక్, చీటింగ్ కేసులో చాట !
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది, ఈడీ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఎటువంటి ఈ కేసులో ఉపశమనం ఇవ్వలేమని, స్టే ఇవ్వలేమని తమిళనాడు హైకోర్టు చెప్పింది. అన్నాడీఎంకే హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు.
అప్పట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై కేసులు పెట్టారు. ఈ కేసులు చెన్నై ఎం.పీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మోసం చెయ్యడంతో వచ్చిన ఆదాయాన్ని అక్రమంగా బదిలీ చేసినందుకు సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు అక్రమ నగదు బదిలీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2023 జూన్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేవారు.

సెంథిల్ బాలాజీ అక్రమ నగదు బదిలీ నిషేధ చట్టం కేసు విచారణ పెండింగ్‌లో ఉన్న కేసు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని కోరుతూ చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు గత ఫిబ్రవరిలో సెంథిల్ బాలాజీ పిటిషన్‌ను కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ సెంథిల్ బాలాజీ మద్రాసు హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సెంథిల్ బాలాజీ పిటిషన్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌లు ఎంఎస్ రమేష్, జస్టిస్ సుందర్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
సెంథిల్ బాలాజీ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.ప్రభాకరన్ వాదించారు. మోసం కేసులో అభియోగాలు నమోదు చేసే ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తు ప్రారంభించలేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కేసు దర్యాప్తునకు అనుమతిస్తే, మోసం కేసు నిర్దోషిగా తేలితే దాని ప్రభావం పడుతుందని సమాచారం. దీంతో ఈడీ కేసు దర్యాప్తుపై స్టే విధించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు, కేసు ప్రాథమిక దశలో ఉన్నందున తాము ఎలాంటి స్టే విధించలేమని మద్రాసు హైకోర్టు చెప్పింది. సెంథిల్ బాలాజీ పిటిషన్ పై ఏప్రిల్ 25వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని ఈడీ అధికారులను ఆదేశించిన న్యాయమూర్తులు విచారణను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications