మంత్రికి చెంప దెబ్బ: ఘనసన్మానం చేశారు

అమృత్ సర్: పంజాబ్ రాష్ట్ర పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్ ముల్కా ను ప్రశ్నించడంతో పాటు ఆయన్నుచెంప దెబ్బ కొట్టిన వ్యక్తిని సిక్కులు ఘనంగా సన్మానించారు. అమృత్ సర్ లోని రాడికల్ సిక్కు గ్రూప్ శిరోమణి అకాలీ దళ్ నాయకులు ఆ ధైర్యవంతుడిని సన్మానించి పండుగ చేసుకున్నారు.

అమృత్ సర్ లోని జర్నైల్ సింగ్ నివాసానికి చేరుకున్న నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించి రూ. 2.2 లక్షల చెక్కు (నగదు) అందజేశారు. అనంతరం రాడికల్ సిక్కు గ్రూప్ శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సిమ్రజిత్ సింగ్ మాన్ మాట్లాడుతూ అవినీతి మంత్రి సికిందర్ ను ధైర్యంగా ప్రశ్నించారని గుర్తు చేశారు.

అంతే కాకుండ ఆయనకు బుద్ది రావడానికి ఓ చెంప దెబ్బ కొట్టి సిక్కులకు ఆదర్శంగా నిలిచారని, జర్నైల్ సింగ్ నిజమైన సిక్కు అంటూ కొనియాడారు. రాజకీయాల లభ్ది కోసం అధికారంలో ఉన్న బాదల్ నేతృత్వంలోని ప్రభుత్వం సిక్కు మతాన్ని అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.

The minister's turban fell off when Jarnail Singh allegedly slapped him.

అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నవంబర్ 20వ తేదిన బటిండాలోని హమిగడ్ గ్రామంలో అకాలీ దళ్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్ ముల్కా పాల్గోన్నారు.

ఇదే సందర్బంలో మంత్రి పనితీరును ప్రశ్నించిన జర్నైల్ సింగ్ ఆయన్ను చెంప దెబ్బ కొట్టారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు జర్నైల్ సింగ్ ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఆయన్ను ఫరీద్ కోట్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు జర్నైల్ సింగ్ మీద వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకునింది. కేసు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి జర్నైల్ సింగ్ పలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+