Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంను ఇలాకూడా బెదిరిస్తారా ?, అసలు ఏం జరుగుతోంది అంటూ ఆరా !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి పదవులు రాని వారిలో, సీనియర్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ దెబ్బతో ఇప్పటికే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇప్పుడు మరోసారి కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అసంతృప్తి మళ్లీ రాజుకుంది. గతంలో మంత్రి పదవి కోల్పోయిన బసవరాజ రాయరెడ్డి, బీకే హరిప్రసాద్ సహా పలువురు నేతలు సిద్ధరామయ్య, హైకమాండ్ నేతలపై బహిరంగంగానే అసంతృప్తితో వ్యక్తం చేశారు. దీంతో వారు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జోరుగాసాగింది. ఇంతకుముందు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆలంద కాంగ్రెస్ ఎమ్మెల్యే మరోసారి కర్ణాటక ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

The MLAs of their own party are threatening the Siddaramaiah government to resign

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు అసమ్మతినేతల పంచాయితీలు పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రికి లేఖ రాసి రాజీనామా చేస్తానని ఆలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ హెచ్చరించారు. అలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.ఆర్. పాటిల్ కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే, రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

The MLAs of their own party are threatening the Siddaramaiah government to resign

ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ కూడా రాశారు. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపడుతున్న పనులపై ఆలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే, రెవెన్యూ శాఖా మంత్రి కృష్ణ బైరేగౌడలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేఆర్‌ఐడీఎల్‌ పనులను లంచాలుగా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చేస్తూ బెళగావిలో జరిగే సభకు నేను హాజరుకావడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. అప్పటికీ ఆరోపణలతో సభకు వస్తే అభియోగాలు స్వీకరించిన వాళ్లు అవుతామని, కాబట్టి నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చేందుకు విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సీఎం సిద్దరామయ్యకు మనవి చేశారు.

తాను లంచం తీసుకున్నట్లు రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సీఎం సిద్ధరామయ్యకు రాసిన లేఖలో వివరించారని వెలుగు చూసింది. గత అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాసిన అలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ 2013లో కేఆర్‌ఐడీఎల్ సంస్థకు పనులు ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల 2013లో ఇచ్చిన పనులు ఇంకా పూర్తి కాలేదని వివరించారు.

The MLAs of their own party are threatening the Siddaramaiah government to resign

నేను కేఆర్ఐడీఎల్ నుంచి లంచం తీసుకుని పనులు ఇచ్చానని తన వైపు చూశారని, మంత్రి ప్రియాంక్ ఖార్గే, మంత్రి కృష్ణభైరగౌడ నాపై అనుమానం వచ్చేలా మాట్లాడారని, ఆ పనులకు సంబంధించి ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడంపై ప్రియాంక ఖార్గే మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ రాసిన లేఖ తనకు ఇంకా అందలేదని, ఆ లేఖ వచ్చిన తరువాత మాట్లాడుతానని సిద్దరామయ్య అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+