Aunty: కారు, లక్షల కోసం కోడలితో యాసిడ్ తాగించిన అత్త, భర్త ఏం చేశాడంటే ? !

కోడలు కట్నం, కారు తీసుకురాదని ఆమెతో యాసిడ్‌ తాగించడం కలకలం రేపింది. ఎక్కువ మోతాదులో యాసిడ్ తాగించడంతో అమాయకురాలైన కోడలు ?

లక్నో/రాయ్ బరేలి: దాదాపు అన్ని వివాహాల్లోనూ ఏదో ఒక రూపంలో వరకట్నం ఇచ్చుకుంటూనే ఉన్నారు. బైక్, కారు, ఇల్లు, నగలు, డబ్బు కట్నం రూపంలో కాకుండా గిఫ్ట్ అనే ముద్దు పేరు పెట్టుకుని కట్నం తీసుకుంటున్నారు. కట్నంగా కారు, లక్షల రూపాయలు, డబ్బులు తీసుకురాలేదని కోడలిని అత్తమామలు, భర్త చిత్రహింసలు పెట్టారు. పదేపదే ఆమెను పుట్టింటికి తరిమేశారు. చివరికి ఏం చేసినా కోడలు కట్నం, కారు తీసుకురాదని ఆమెతో యాసిడ్‌ తాగించడం కలకలం రేపింది. ఎక్కువ మోతాదులో యాసిడ్ తాగించడంతో అమాయకురాలైన కోడలు ?

 ఆరు ఏళ్ల క్రితం పెళ్లి

ఆరు ఏళ్ల క్రితం పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలోని అంజుమ్ (25) అనే యువతి నివాసం ఉంటున్నది. ఆరు సంవత్సరాల క్రితం ఇలియాజ్ అనే వ్యక్తితో అంజుమ్ వివాహం అయ్యింది. పెళ్లికి ముందే అంజుమ్ కుటుంబ సభ్యులు పెళ్లికొడుక్కు ఇలియాజ్ కు కట్నం కింద భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు ఇచ్చారని సమాచారం.

 అదనపు కట్నం

అదనపు కట్నం

పెళ్లయిన తరువాత భర్త ఇలియాజ్, అత్తగారు కట్నం రూపంలో కారు, డబ్బు తీసుకురావాలని అంజుమ్ ను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు అత్తమామలు కోడలు అంజుమ్ ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. పుట్టింటికి వెలుతున్న అంజుమ్ కొన్ని రోజులు అక్కడే ఉంటూ మళ్లీ అత్తారింటికి వెలుతున్నది. పుట్టింటి నుంచి వచ్చిన ప్రతిసారీ అంజుమ్ కారు. డబ్బులు తీసుకురావడం లేదని భర్త ఇలియాజ్, అతని కుటుంబ సభ్యులు ఆమెతో గొడవపడుతూనే ఉన్నారు.

 పుట్టింటిలో ఏం చెప్పలేక ?

పుట్టింటిలో ఏం చెప్పలేక ?

పుట్టింటికి వెలుతున్న ప్రతిసారి అంజుమ్ ఏదో ఒక స్టోరీ చెప్పి తల్లిదండ్రులను నమ్మిస్తూ వచ్చింది. ఇంత కష్టపడి తనకు పెళ్లి చేసి పంపించిన తల్లిదండ్రులకు అత్తారంటిలో జరుగుతున్న విషయాలను ఎలా చెప్పాలో తెలీక అంజుమ్ ఆమెలో ఆమె కుమిలిపోయింది. ఫిబ్రవరి 20వ తేదీన అంజుమ్ ను వరకట్న కోసం ఆమె అత్తమామలు తీవ్ర వేధింపులకు గురి చేశారు. మీ ఇంటికి వెళ్లి రెండున్నర లక్షల రూపాయలు, కొత్త కారు తీసుకురావాలని అంజుమ్ ను హెచ్చరించారు.

 కోడలితో యాసిడ్ తాగించిన అత్తమామలు

కోడలితో యాసిడ్ తాగించిన అత్తమామలు

మా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లు ప్రస్తుతానికి రూ. 2.5 లక్షల రూపాయలు, కారు ఇచ్చే పరిస్థితిలో లేరని, మాకు కొంచెం సమయం కావాలని అంజుమ్ ఆమె అత్తమామలకు చెప్పింది. దీంతో అత్తారింటి వాళ్లకు ఎక్కడలేదని కోపం వచ్చింది. ఈ కోపంలో భర్త ఇలియాజ్ తోపాటు, అత్త కలిసి అంజుమ్ తో బలవంతంగా యాసిడ్ తాగించారు

 ప్రాణం పోయింది

ప్రాణం పోయింది

వెంటనే అంజుమ్ ను పిలుచుకుని వెళ్లి ఆమె పుట్టింటి వాళ్లు నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 21వ తేదీన అంజుమ్ జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అంజుమ్ శనివారం రాత్రి చనిపోయింది. అంజుమ్ చనిపోయిందని తెలుసుకున్న ఆమె భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు పరారైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+