మంత్రి మీద అట్రాసిటి కేసు నమోదు, ప్రైవేటు ఆస్తి కోసం యువతి మీద దాడి చేసి ?

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని యలహంకలో వివాదాస్పద ఆస్తికి సంబంధించి ఓ కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించి ఆ భూమిలో అక్రమంగా చొరబడ్డారనే ఆరోపణలపై కర్ణాటక మంత్రి డి.సుధాకర్‌పై కేసు నమోదు కావడం కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా మంత్రి డి. సుధాకర్ తదితరులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో సెవెన్‌హిల్స్‌ డెవలపర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ను నిందితుడు నంబర్‌ 1గా, మంత్రి డి. సుధాకర్‌ను నిందితుడు నంబర్‌ 2గా పేర్కొన్నారు. శ్రీనివాస్, భాగ్యమ్మలను వరుసగా 3, 4 నిందితులుగా పేర్కొన్నారు. మంత్రి సుధాకర్ సెవెన్ హిల్స్ డెవలపర్స్ డైరెక్టర్ అని, తనకు సెవెన్‌హిల్స్‌ డెవలపర్స్‌కు మధ్య యలహంకలోని సర్వే నంబర్‌ 108/1కి సంబంధించిన ఆస్తి వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని ఫిర్యాదుదారు సుబ్బమ్మ ఆరోపించారు.

The police registered an atrocity case against the minister for allegedly attacking women
శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధాకర్ తో పాటు మరో 35 మంది జేసీబీలతో వచ్చి ఇంట్లోని షీట్ షెడ్డును, ఇంటి కాంపౌండ్‌ను ధ్వంసం చేశాని బాధితులు పోలీసులకు చెప్పారు. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి మంత్రి సుధాకర్ ను ప్రశ్నించగా మ్మమల్ని కుల పేుతో దూషించారని ఫిర్యాదుదారు సుబ్బమ్మ తెలిపారు.

మంత్రి సుధాకర్ తన కుమార్తె ఆశాపై దాడి చేశాడని, కులం పేరుతో బూతులు తిట్టాడరని సుబ్బమ్య ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులను తొలగించాలని సుబ్బమ్మ పోలీసులకు మనవి చేశారు. మంత్రి సుధాకర్ తో పాటు మా ఆస్తిని నాశనం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు సుబ్బమ్మ పోలీసులకు తెలిపారు.

వివాదాస్పద స్థలంలో మంత్రి డి. సుధాకర్ చాలా సేపు అక్కడే ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద మంత్రి సుధాకర్ మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి డి. సుధాకర్ తోసిపుచ్చుతున్నారు. తాను ఆ స్థలాన్ని సందర్శించలేదని మంత్రి సుధాకర్ చెప్పారు.

ఇన్నాళ్లుగా తాను ఎవరిని కలవలేదని, ఆ స్థలాన్ని కూడా సందర్శించలేదని.. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాని, ఆ భూమి కంపెనీకి చెందిందని, డబ్బు తన ఖాతాలోకి జమ చేశారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంత్రి డాక్టర్ సుధాకర్ మీడియాకు చెప్పారు. కులం పేరుతో మహిళలను దూషించారని, యువతి మీద దాడి చేశారని మంత్రి మీద కేసు నమోదు కావడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+