తిరుమలలో ఇది పరిస్థితి, చిరుత దాడితో నడక మార్గంలో భక్తులను ఇలాగే !

తిరుమల/తిరుపతి: కలియుగ వైకుంఠ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం శ్రీవారిని 67, 294 మంది భక్తులు దర్శించుకున్నారు. గురువారం రాత్రి వరకు 33, 529 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4 కోట్ల 9 లక్షలు సమర్పించుకున్నారు. గురువారం తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూ లైన్ బయటకు వచ్చి టీబీసీ గెస్ట్ హౌస్ వరకు పెరిగిపోయింది. ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం టోకన్లు లేని భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోందని శుక్రవారం ఉదయం టీటీడీ పీఆర్ వో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Tirumala

తిరుమల కాలినడక మార్గంలోని 7వ మైలు దగ్గర ఓ చిరుత బాలుడి మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. తిరుమతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో గాయపడిన కౌషిక్ అనే చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన కౌసిక్ కోలుకుంటున్నాడని, ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు అంటున్నారు.

Tirumala

ఇదే సమయంలో తిరుమల కాలినడక మార్గంలో టీటీడీ అటవి శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీటీ అటవి శాఖ అధికారులు పోలీసులు తిరుమల కాలినడక మార్గంలో ఎప్పటికప్పుడు సంచరిస్తూ అటవి ప్రాంతం నుంచి జంతువులు కాలినడ మార్గంలోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Tirumala

తిరుమల కాలినడక మార్గంలో బాలుడి మీద చిరుత దాడి చెయ్యడం బాధకరమని, మరోసారి ఇలాంటి సంటనలు ఎదురుకాకుండా చూసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి-తిరుమల కాలి నడక మార్గంలో శ్రీవారి భక్తులను గుంపులు గుంపులుగా పంపించాలని నిర్ణయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులు గుంపులుగా వెలుతుంటే జంతువులు దాడి చేసే అవకాశం ఉండదని టీటీడీ అటవి శాఖ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+