వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యతో కాపురం చెయ్యాలంటే ప్రతి నెల ట్యాక్స్: సౌదీలో భారతీయుల కాపురాలు ఢమాల్ !

సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకు వచ్చింది. సౌదీ అరేబియా ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ కొత్తగా తీసుకు వచ్చిన చట్టంతో ఆదేశంలో ఉద్యోగం, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న 41 మంది భారతీయుల.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకు వచ్చింది. సౌదీ అరేబియా ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ కొత్తగా తీసుకు వచ్చిన చట్టంతో ఆదేశంలో ఉద్యోగం, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న 41 మంది భారతీయుల మీద పిడుగుపడినట్లు అయ్యింది.

<strong>లవ్ ఫెయిల్: ప్రియుడి ఆత్మహత్య: వీడియో కాల్, లైవ్ లో చూసిన ప్రియురాలు, చివరికి !</strong>లవ్ ఫెయిల్: ప్రియుడి ఆత్మహత్య: వీడియో కాల్, లైవ్ లో చూసిన ప్రియురాలు, చివరికి !

సౌదీ అరేబియా కొత్తగా తీసుకు వచ్చిన కొత్త చట్టం ప్రకారం భారతీయులు తన భార్యతో కలిసి సౌదీ అరేబియాలో నివాసం ఉంటూ భార్యతో కాపురం చెయ్యాలంటే ప్రతి నెల కచ్చితంగా 100 రియాలు (భారత కరెన్సీ ప్రకారం రూ. 1,700) పన్ను చెల్లించాలి. ఈ దెబ్బతో సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసుకుంటూ భార్యతో కలిసి నివాసం ఉంటున్న భారతీయులు హడలిపోతున్నారు.

భార్యతో కాపురం చెస్తావా !

భార్యతో కాపురం చెస్తావా !

సౌదీ అరేబియాలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న భారతీయులు చాల వరకు వారి భార్య, పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. భార్యతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు భార్యతో అక్కడ కాపురం చెయ్యాలంటే ప్రతి నెల కచ్చితంగా రూ. 1,700 ట్యాక్స్ (పన్ను) చెల్లించాలి.

కుమారుడు, కుమార్తె ఉంటే !

కుమారుడు, కుమార్తె ఉంటే !

భార్యతో పాటు కుమారుడు లేదా కుమార్తె ఉన్నా సరే మరో 100 రియాలు (రూ. 1,700) చెల్లించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే భార్య, కుమారుడు లేదా కుమార్తె ఉంటే ప్రతి నెల రూ. 3,400 ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

41 లక్షల మంది కాపురాలు !

41 లక్షల మంది కాపురాలు !

భారతదేశానికి చెందిన 41 లక్షల మంది ప్రస్తుతం వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ సౌదీ అరేబియాలో జీవనం సాగిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన చట్టం ప్రకారం 41 మంది భారతీయులు ఆందోళనకు గురౌతున్నారు.

చలో భారత్ అంటూ !

చలో భారత్ అంటూ !

సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇప్పుడు నెలకు రూ. 3,400 పన్ను రూపంలో అక్కడి ప్రభుత్వానికి చెల్లించుకోలేని పరస్థితి ఎదురైయ్యింది. ఈ దెబ్బతో భార్య, పిల్లలను భారత్ పంపించేయ్యడానికి దాదాపు 70 శాతం మంది సిద్దం అయ్యారని తెలిసింది. ఇప్పటికే చాల మంది తమ భార్య, పిల్లలను భారత్ పంపించడం మొదలు పెట్టారు.

5,000 రియాలు జీతం ఉంటేనే భార్య !

5,000 రియాలు జీతం ఉంటేనే భార్య !

సౌదీ అరేబియాలో ప్రస్తుతం నెలకు 5,000 రియాలు (రూ. 85,000) జీతం వస్తున్న వారికే ఫ్యామిలీ వీసాలు ఇస్తున్నారు. 5 వేల రియాల కంటే ఒక్క రియాలు తక్కువ వస్తున్నా ఫ్యామిలీ వీసాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు మరో కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో భార్యతీయులు భార్యతో కాపురం చెయ్యాంటే ఆర్థిక భారం నెత్తినపడింది.

ప్రతి సంవత్సరం భార్య భారం !

ప్రతి సంవత్సరం భార్య భారం !

భార్య, కుమారుడు లేదా కుమార్తెతో కలిసి ఉంటే ప్రస్తుతం అమలు చేసిన చట్టం ప్రకారం నెలకు 200 రియాలు (రూ.3,400) పన్ను చెల్లించాలి. అయితే ప్రతి సంవత్సరం ఈ పన్ను 100 రియాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

రంజాన్ కోసం వచ్చి !

రంజాన్ కోసం వచ్చి !

రంజాన్ పండుగ సందర్బంగా సెలవులపై ఇప్పటికే భార్య, పిల్లలతో చాల మంది భారత్ చేరుకున్నారు ఇలా సౌదీ అరేబియా నుంచి వచ్చిన భారతీయులు ఇప్పుడు భార్య, పిల్లలను ఇక్కడే వదిలిపెట్టి ఒంటరిగా వెళ్లడానికి సిద్దం అయ్యారు.

English summary
Several Indians living in Saudi Arabia are bracing for financial trouble. The Saudi Government will start imposing a dependent fee of 100 riyals or Rs 1,700 every month. While this will prove to be a huge financial burden on the Indians employed in Saudi Arabia, they are now planning on sending their dependents back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X