మైండ్ బ్లాక్, సిద్దరామయ్య వర్గం సీనియర్ ఎమ్మెల్యేల సీక్రేట్ సమావేశం, డిమాండ్ అదే !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సంపూర్ణా మెజారిటీ రావడంతో సంతోషంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి తయారైయ్యింది. సంపూర్ణ మెజారిటీ రావడంతో సొంత పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఎవరినో ఒకరిని సీఎం చెయ్యాల్సి ఉంది. ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యేలు బెంగళూరులో రహస్య సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరులో ఆదివారం సాయంత్రం 5. 30 గంటలకు సీఎల్ పీ సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆధ్వర్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్ పీ సమావేశానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు షాక్ ఇచ్చారు.

Siddaramaiahs faction held a secret meeting in Bengaluru

సిద్దరామయ్య వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆదివారం మద్యాహ్నం బెంగళూరులోని కన్నింగ్ హ్యామ్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ కు చెందిన విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చెయ్యాలని చర్చించారని తెలిసింది.

అయితే ఈ రహస్య సమావేశంలో సిద్దరామయ్య కూడా పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది. సిద్దరామయ్య, మాజీ మంత్రులు ఎంబీ. పాటిల్, దినేష్ గుండూరావ్, కేజే జార్జ్, జహీర్ అహమ్మద్ ఖాన్, క్రిష్ణ భైరేగౌడ, భైరతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కనీసం 100 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడబెట్టుకుని సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని ఈ సమావేశంలో చర్చించారని తెలిసింది.

రహస్య సమావేశం నిర్వహించిన సీనియర్ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని తెలిసింది. సీఎల్ పీ సమావేశంలో సిద్దరామయ్యకు మద్దతుగా ఉండాలని, ఆయన్ను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని సిద్దూ వర్గంలోని ఎమ్మెల్యేలు రహస్య చర్చలు జరిపారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సైతం ఆయన సీఎం కావాలని ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారని వెలుగు చూసింది. ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో బెంగళూరులోని సిద్దరామయ్య ఇంటికి చేరుకుంటున్నారు. ఈ సందర్బంలో మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటి ముందు బెంగళూరు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+