• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదిరేది లేదు.. బెదిరేది లేదు..! కశ్మీర్ లోయలో బలగాల మొండి ధైర్యం..!!

|

కశ్మీర్/హైదరాబాద్ : భారత భద్రతా దళాలు పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మడమ తిప్పేది లేదంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా పారిపోయేది లేదని తెగేసి చెప్పుకొస్తున్నాయి కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. మరోవైపు కశ్మీర్‌లో ఉద్రిక్త, ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఉగ్రవాదుల దాడి ముప్పు పొంచి ఉంచడం, నియంత్రణ రేఖ వెంబడి పాక్‌తో ఘర్షణలు పెరిగిన నేపథ్యంలో కీలక ప్రాంతాలు, సునిశిత ప్రదేశాల్లో భద్రతా బలగాల మోహరింపును అధికారులు పెంచారు. అమర్‌నాథ్‌ యాత్రను అర్ధంతరంగా రద్దు చేసి, పర్యాటకులందరినీ కశ్మీర్‌లోయను విడిచి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించిన నేపథ్యంలో స్థానికులు నిత్యావసర సరకుల కోసం మార్కెట్లకు తరలడంతో దుకాణాలు, చమురు బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి.

దేనికైనా రెఢీ..! అత్యంత అప్రమత్తంగా భద్రతా బలగాలు..!!

దేనికైనా రెఢీ..! అత్యంత అప్రమత్తంగా భద్రతా బలగాలు..!!

పలు విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులను వసతి గృహాలు ఖాళీ చేయాలని ఆదేశించాయి. ఇప్పటికే రాష్ట్రానికి తీసుకొచ్చిన అదనపు పారామిలిటరీ బలగాలను శ్రీనగర్‌తోపాటు, లోయలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. సచివాలయం, పోలీసు ప్రధాన కేంద్రం, విమానాశ్రయం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాల్ని పెంచారు. శ్రీనగర్‌ నగరంలోకి ప్రవేశించే, నిష్క్రమించే రహదారుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలుచోట్ల అల్లర్లను నియంత్రించే వాహనాల్ని సిద్ధం చేశారు. మరోవైపు..సరిహద్దుల వెంబడి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు లాంఛ్‌ప్యాడ్లలో వేచి చూస్తున్నట్లు నిఘావర్గాలు ప్రభుత్వాన్ని, భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి.

డోభాల్‌ తదితరులతో షా భేటీ..! కీలక ప్రాంతాల్లో సైన్యం మోహరింపు..!!

డోభాల్‌ తదితరులతో షా భేటీ..! కీలక ప్రాంతాల్లో సైన్యం మోహరింపు..!!

ఢిల్లీలోని పార్లమెంటు సముదాయంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కశ్మీర్‌ అంశంపై భద్రత బలగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఏం మాట్లాడుకున్నారనేది నిర్దిష్టంగా తెలియరాలేదు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్‌ గౌబ, ఐబీ అధిపతి అర్వింద్‌ కుమార్‌, రా చీఫ్‌ సామంత్‌కుమార్‌ గోయెల్‌, హోంశాఖ సీనియర్‌ అధికారులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 వ్యాపార సముదాయాల వద్ద భారీ క్యూలు..!ఆందోళనలో కశ్మీర్ వాసులు..!!

వ్యాపార సముదాయాల వద్ద భారీ క్యూలు..!ఆందోళనలో కశ్మీర్ వాసులు..!!

నియంత్రణ రేఖ వెంబడి భారత్‌, పాక్‌ సైనికుల మధ్య తాజాగా ఘర్షణలు పెరిగిన క్రమంలో సమావేశం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే భాజపా నిర్ణయం నేపథ్యంలో కశ్మీర్‌లోయలో భద్రతా పరిస్థితిపై అమిత్‌షా సమీక్షించారు. పార్లమెంటు సమావేశాల అనంతరం అమిత్‌షా కశ్మీర్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ, ఉధంపూర్‌, కాట్రాల నుంచి బయల్దేరే రైళ్లలో టికెట్ల తనిఖీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

 భద్రతాధికారులతో అమిత్‌షా సమీక్ష..!పరిస్తితి అదుపులో ఉందన్న అదికారులు..!!

భద్రతాధికారులతో అమిత్‌షా సమీక్ష..!పరిస్తితి అదుపులో ఉందన్న అదికారులు..!!

అమర్‌నాథ్‌ యాత్రికులు తదితరులు రిజర్వేషన్‌ టికెట్లు లేకపోయినా రాష్ట్రం నుంచి సాఫీగా వెళ్లిపోయేందుకు వీలవుతుందని భావిస్తోంది. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లా అవంతిపొరాలోని ఇస్లామిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐయూఎస్‌టీ) అన్ని పరీక్షలనూ వాయిదా వేసింది. వసతి గృహాలు ఖాళీ చేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరింది. గందరగోళ పరిస్థితులు, కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీనగర్‌లోని ఎన్‌ఐటీ విద్యార్థులు ఆదివారం జమ్మూ నుంచి స్వస్థలాలకు బయల్దేరారు. ఆగస్టు 15 తర్వాత కళాశాల పునః ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని ఏపీకి చెందిన పరమేశ్వర్‌రెడ్డి అనే విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian security forces are demonstrating prowess. No tense situation arose in the Kashmir valley, but it was pledged to not turn the heel. The situation is so negative that it does not run away. The security forces were prepared to face any situation in Kashmir. For this purpose, they have completed all kinds of arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more