ప్రతిపక్షాలపై ఆధునిక తాలిబన్, అల్ ఖైదాను ప్రయోగిస్తోన్న కేంద్రం..!!
సీబీఐ, ఈడీ దర్యాప్తును తాలిబన్, అల్ ఖైదా తరహాలో కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.
ముంబై: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన వ్యవహారంపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. ఈ కేసులో మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ విచారణ..
ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ అధికారుల విచారణలో ఉన్నారు. ఇవ్వాళ ఆయన కస్టడీ ముగిసింది. దీనితో ఆయనను సీబీఐ అధికారులు ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. కస్టడీని పొడిగించాలంటూ అభ్యర్థించనున్నారు. మనీష్ సిసోడియా ఇదివరకే బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాలను ఢిల్లీ న్యాయస్థానం ఆలకించనుంది.
రబ్రీ నివాసంపైనా..
తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంపైనా సీబీఐ అధికారులు ఇవ్వాళ దాడులు చేశారు. ఈ ఉదయం 9:30 గంటలకు పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. సీబీఐ అధికారులు రబ్రీదేవిని విచారిస్తోన్నారనే విషయం తెలిసిన వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి ఆమె నివాసానికి చేరుకున్నారు.
సీబీఐ, ఈడీ దాడులపై..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల పట్ల ఇదివరకే ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు సంతకాలు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేపడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు.

బీజేపీపై దాడులు జరిగాయా?
భారతీయ జనతా పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడి ఇంటిపై లేదా కార్యాలయాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారా? అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. తమనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం- తన అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గౌతమ్ అదాని లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డాడని, ఆయన గురించి ప్రశ్నించినందుకు బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని విమర్శించారు.

తాలిబన్, అల్ ఖైదా తరహాలో..
తాలిబన్, అల్ ఖైదా తరహాలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. దాడులు సాగించడానికి తాలిబన్లు, అల్ ఖైదా ఎలాంటి మారణాయుధాలను ప్రయోగిస్తాయో.. కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఐ, ఈడీ, ఐటీ, ఇతర దర్యాప్తు సంస్థలను అదే తరహాలో ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. ఈ దాడుల నుంచి బీజేపీ, ఎన్డీఏ కూటమి పక్షాల నేతలను ఎందుకు మినహాయిస్తోన్నారని ప్రశ్నించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications