భర్త గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడిన సమంత ఏం చేసింది ?, బంధువులు వదల్లేదు !
వివాహం చేసుకున్న తరవాత దంపతులు సంతోషంగా జీవించాలని అనుకుంటారు. పెళ్లి జరిగిన తరువాత భర్త వేరే మహిళతో క్లోజ్ గా ఉన్నా, లేకుంటా భార్య వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉన్నా భార్య, భర్తలు సహించలేరు. భర్త కాని, భార్య కాని అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని తెలిసినా, అనుమానం వచ్చినా ఆ కాపురంలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భర్తకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో అతని భార్య చేసిన పనికి పోలీసులు సైతం హడలిపోయారు.
భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతని భార్య ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలోని మారుతీ లేఅవుట్‌లోని బిలేశివాలే దొడ్డ గుబ్బి మెయిన్‌రోడ్డులో చోటుచేసుకుంది. శరణ్, సమంత అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న తరువాత శరణ్, సమంత దంపతులు కొత్తనూరు సమీపంలోని మారుతి లేఔట్ లో నివాసం ఉంటున్నారు. సమంత, శరణ్ దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

శరణ్, సమంత దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. వివాహిత మహిళతో శరణ్ చాలా క్లోజ్ గా ఉండేవాడని తెలిసింది. మూడేళ్ల క్రితం వరకు ఆ మహిళతో శరణ్ సన్నిహితంగా ఉండేవాడు. అప్పట్లో ఆ మహిళ ఇల్లు కట్టే సమయంలో కంకర, ఇసుక, హాలో బ్లాక్‌లను కొనుగోలు చేసింది. ఇల్లు కట్టడానికి కావలసిన ఇసుక, ఇటుకలు, కంకర కొనుగోలు చేసే సమయంలో ఆమెకు శరణ్ సహాయం చేశాడని, ఆ సామాగ్రి ఆమె ఇంటి దగ్గరకు తెప్పించాడని తెలిసింది.
ఆ సందర్బంలో వివాహిత మహిళ శరణ్‌కు నగదు రూపంలో డబ్బు ఇచ్చింది. తన భర్త శరణ్ కు వివాహిత మహిళ డబ్బులు ఇచ్చిందని, వీరి మధ్య ఏదో ఉందని సమంతకు అనుమానం వచ్చింది. ఈ విషయం తెలిసిన తరువాత శరణ్ భార్య సమంత నా భర్తతో నీకు అక్రమ సంబంధం ఉందా?' అంటూ వివాహిత మహిళ మీద కేకలు వేస్తూ అప్పట్లో పెద్ద గొడవ చేసిందని తెలిసింది. అదే సమయంలో సమంత ఆమె భర్త శరణ్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్న ఆ మహిళకు వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ ఘటన తర్వాత శరణ్ ఆ మహిళతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అయితే ఆ తర్వాత శరణ్ ఓ మాల్‌లో ఆ వివాహిత మహిళతో తెలిసిన వాళ్లకు కనిపించాడు. ఈ విషయం శరణ్ భార్య సమంతకు తెలియడంతో ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరిగినా వివాహిత మహిళ తన భర్త శరణ్ తో తిరుగుతోందని సమంత రగిలిపోయింది. సమంత ఆమె సమీప బంధువులు అయిన కెంపరాజు, శరత్‌లతో కలిసి ఆదివారం అర్దరాత్రి వివాహిత మహిళ ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించారు.

మహిళ ఇంటి కిటికీ అద్దాలు, తలుపులు, ఇంటి ముందు పార్క్ చేసిన కారు, బైక్‌లను ద్వంసం చేశారు. ఇంకోసారి నా భర్త శరణ్ తో మాట్లాడినా, అతనితో ఎక్కడైనా కనపడినా నీ అంతు చూస్తామని వివాహిళ మహిళకు శరణ్ భార్య సమంత, ఆమె బంధువులు కెంపరాజు, శరత్ తదితరులు వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. సమంత అండ్ కో దాడి చెయ్యడంతో హడలిపోయిన వివాహిత మహిళ కొత్తనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications