తీవ్ర అసహనం, వెనక్కిచ్చేందుకు సిద్ధం: షారూక్ ఖాన్
ముంబై: నేడు(నవంబర్ 02న) తన 50వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగుతున్న మతపరమైన ఘటనలు ఎంతో మందిలో అసహనాన్ని పెంచుతున్నాయని, తనకు లభించిన అవార్డులను వెనక్కిచ్చేందుకు వెనుకాడబోనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియాటుడే ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అవును. నేనూ అవార్డులు ఇచ్చేందుకు వెనుకాడను. చాలా మందిలో అసహనం పెరుగుతోంది. అదీ చాలా ఎక్కువగా ఉంది' అని షారుక్ ఖాన్ చెప్పారు.

తాను సెలబ్రిటీని కాకముందు తొలినాళ్లలో ఓ ముస్లింగా ఎదుర్కొన్న ఘటనలను, సెలబ్రిటీగా మారిన తర్వాత విదేశాల్లో తనకు ఎదురైన అనుభవాలను షారూఖ్ గుర్తు చేసుకున్నారు. తన దేశ భక్తిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు.
కాగా, ఇప్పటికే హర్షవర్థన్ కులకర్ణి, నిషాత్ జైన్, దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్థన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తమతమ అవార్డులను తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అనుపమ్ ఖేర్, మధుర్ బండార్కర్ వంటి వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదో పబ్లిసిటీ జిమ్మిక్ అని, అవమానకర చర్య అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications