RTC BUS: రాత్రి ఆర్ టీసీ బస్ స్టాండ్ లో బస్సు మాయం, తెలంగాణలో వదిలేసి, సీసీటీవీ కెమెరాల్లో ?, అంతే !
బస్ స్టాండ్ లో ఉన్న ఆర్ టీసీ బస్సునే ఎత్తుకుపోయారు. ఆర్ టీసీ బస్సుతో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారు. గ్రహాలు అనుకూలించకపోవడంతో ఆర్ టీసీ బస్సు అదుపుతప్పడంతో అసలు కథ మొదలైయ్యింది.
బెంగళూరు/బీదర్/హైదరాబాద్: చోరీలు చేస్తున్నారని కేసులు నమోదు కావడం సర్వసాధారణం అయిపోయింది. బైక్ లు, కార్లు, నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు చోరీ చెయ్యడం, కేసులు నమోదు కావడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఓ కిలాడీ ఏకంగా ఆర్ టీసీ బస్సుకు స్కెచ్ వేశాడు. బస్ స్టాండ్ లో ఉన్న ఆర్ టీసీ బస్సునే ఎత్తుకుపోయాడు. ఆర్ టీసీ బస్సుతో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అయితే అక్కడ గ్రహాలు అనుకూలించకపోవడంతో ఆర్ టీసీ బస్సు అదుపుతప్పడంతో అసలు కథ మొదలైయ్యింది.

ఆర్ టీసీ బస్ స్టాండ్
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని చించోళి పట్టణంలోని బస్టాండ్‌లో రాత్రి ఆగి ఉన్న ప్రభుత్వ బస్సును దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. తెల్లవారుజామున ఆర్ టీసీ బస్సు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రభుత్వ ఆర్ టీసీ బస్టాండ్ లో బీదర్ డివిజన్ యూనిట్‌కు చెందిన కేఏ 38, ఎఫ్ 971 బస్సును నిందితులు డ్రైవ్ చేసుకుంటూ పారిపోయారు.

అసలు ఏం జరిగిందంటే ?
రాత్రి ఆర్ టీసీ బస్సు డ్రైవర్ మహమ్మద్ అయూబ్, కండెక్టర్ ఈరప్ప బస్టాండ్ ప్లాట్‌ఫాం మూడులో బస్సును పార్క్ చేసి బస్ స్టాండ్ లోని విశ్రాంతి గదిలోకి వెళ్లి పడుకున్నారు. బస్సు పార్క్ చేసిన వెంటనే ఆ బస్సు కిటికీలు, తలుపులు మూసేశారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డ్రైవర్, కండెక్టర్ బస్టాప్‌లోకి వెళ్లి చూడగా ఫ్లాట్ ఫారం మూడులో ఆపి ఉన్న బస్సు కనిపించడకపోవడంతో హడలిపోయారు.

ఆర్ టీసీ బస్సు ఎక్కడికి పోయింది ?
డ్రైవర్, కండెక్టర్
బస్సు కోసం వెతికారు. బస్సు ఎక్కడా కనిపించకపోవడంతో డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బస్సు చోరీ అయ్యిందని డిపో మేనేజర్ అశోక్ పాటిల్ చించోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మహబూబ్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీలను పరిశీలించగా తెల్లవారుజామున 3.37 గంటలకు దొంగలు బస్సును చోరీ చేసి పారిపోయినట్లు గుర్తించారు.

తెలంగాణలో తేలిన ఆర్ టీసీ బస్సు
దొంగలు బస్సును ముఖానికి గుడ్డలు కట్టుకుని చోరీ చేశారని సీసీటీవీల్లో స్పష్టంగా కనపడింది. కేఎస్ఆర్ టీసీ బస్సును తెలంగాణ రాష్ట్రంలోని తాండూరుకు తీసుకెళ్లారని సమాచారం అందడంతో పోలీసులు వెంటపడ్డారు. సీసీ టీవీని పరిశీలించిన పోలీసులు బస్సు కోసం గాలించారు. పట్టణంలోని బస్టాండ్‌లో చోరీకి గురైన బీదర్ యూనిట్‌కు చెందిన ఆర్ టీసీ బస్సు తాండూరు సమీపంలో కనపడింది.

డ్రైనేజ్ లోకి బస్సును నడిపిన నిందితులు
ఆర్ టీసీ బస్సు డ్రైయినేజీలో ఇరుక్కుపోవడంతో ఆ బస్సు అక్కడి నుంచి కదలేకపోయింది. ఆర్ టీసీ బస్సును డ్రైనేజ్ లో నుంచి బయటకు తీసి నడపలేక పోవడంతో దొంగలు బస్సును అక్కడే వదిలేసి పరారయ్యారని ఎస్‌ఐ మహబూబా అలీ మీడియా తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు ఆర్ టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్ టీసీ బస్సును తీసుకు వచ్చామని చించోళి పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications