ఉనావ్‌లో మరో దారుణం : గ్రామస్తులంతా హోలీ బిజీలో ఉన్నవేళ.. మూడో తరగతి బాలికపై..
మహిళా రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు చిన్నారులపై కూడా అత్యాచారాలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్‌లో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులంతా హోలీ వేడుకల్లో బిజీగా ఉన్నవేళ ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ ఇదే ఉనావ్‌లో పలు అత్యాచార ఘటనలు బయటపడ్డ సంగతి తెలిసిందే.

అసలేం జరిగింది..
ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్‌లో మూడో తరగతి చదువుతున్న బాలిక(12) హోలీ పండగ రోజు.. ఇంటి బయట నిలబడి హోలీ వేడుకలను చూస్తోంది. ఇంతలో ఓ యువకుడు ఆమెను తనవైపు రమ్మని సైగ చేశాడు. అతని మనసులో ఏముందో తెలియని ఆ చిన్నారి.. అమాయకంగా అతని వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆమెను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బలంగా ఆమె గొంతు నులిమాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
అటుగా వెళ్లిన కొంతమంది గ్రామస్తులు.. బాలిక అక్కడ పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారి కుటుంబ సభ్యులకు,పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని హుటాహుటిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కారణంగా అక్కడినుంచి కాన్పూర్‌లోని హలెట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
బాలిక మృతితో కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. దీంతో స్థానిక ఎస్పీ విక్రాంత్ వీర్ అక్కడి చేరుకుని అదనపు బలగాలను మోహరించి.. బాధిత బాలిక కుటుంబ సభ్యులు,బంధువులను అక్కడినుంచి పంపించేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని చెప్పారు.

రేప్ ఘటనలతో తరుచూ వార్తల్లో ఉనావ్..
ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్ రేప్ కేసులతో తరుచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లో ఓ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా అడ్డగించిన నిందితులు.. ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను లక్నో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కూడా ఓ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం పేరుతో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడమే కాకుండా.. తన పలుకుబడితో ఆమె పైనే రివర్స్ కేసులు పెట్టించాడు సెంగార్. అంతేకాదు,ఆమె తండ్రిని అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టించడంతో అతను మృతి చెందాడు. అయినా సరే బాధితురాలు వెనక్కి తగ్గకుండా న్యాయం కోసం పోరాడింది. ప్రతిపక్షాలు బీఎస్పీ,ఎస్పీ కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి. చివరకు న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చడంతో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications