ముంబైలో ప్రారంభమైన థర్డ్ వేవ్ - రోజుకు పది వేల కేసులు :కోవిడ్ టాస్క్ ఫోర్స్ అంచనా..!!
దేశ ఆర్దిక రాజధాని ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముంబైలో థర్డ్ వేవ్ మొదలైనట్లుగా మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు. ఆరు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగి..అంతే వేగంగా తగ్గిపోవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఒక్క రోజులో కేసుల సంఖ్య 70 శాతం జంప్ చూశాయి. ఇక తాజాగా నేడు 2510 కొత్త కరోనా కేసులతో 82 శాతం ఎక్కువగా కరోనా కేసులను నమోదు చేసింది.

థర్డ్ వేవ్ మొదలైనా..ఆందోళన అవసరం లేదు
దీని పైన స్పందించిన మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషీ ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. కేసులు పెరగుతున్న సమయంలో ఆందోళన పెరుగుతుందని... జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా..భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నాలుగు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. ముంబైలో కేసుల తీవ్రత రోజులకు పవది వేలవరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంత వేగంగా వెళ్లినా..అంతే వేగంగా తగ్గుదల కూడా ఉంటుందని చెబుతున్నారు.

ఓమిక్రాన్ కేసుల సంఖ్యలో పెరుగుదల
విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు తప్పని చేసామని.. పాజిటివ్ గా గుర్తించిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయగా 80 మందికి ఓమిక్రాన్ నిర్ధారణ అయినట్లుగా తేలుతోందని వివరించారు. అయితే, ఇది డెల్టా కాదని తేల్చి చెప్పిన టాస్కు ఫోర్స్.. థర్డ్ వేవ్ గా స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా ఆరు వారాల సమయంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో.. అదే స్థాయిలో తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢీల్లీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల అంవాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నాయి. ఢిల్లీలో కేసులు పెరిగాయని..అయితే, లక్షణాలు మాత్రం స్వల్పం గానే ఉన్నాయని చెప్పారు. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, అలసట, వెన్నునొప్పి మరియు తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

ఎంత వేగంగా పెరిగినా..అదే స్థాయితో తగ్గుదల
రుచి మరియు వాసన కోల్పోవడం చాలా సందర్భాలలో ఉండదని చెప్పారు. అయితే, ఇవే లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని లేదన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్దమైంది. అవసరమైన కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరిన్ని చర్యలతో పాటుగా వైద్య సేవలను ముమ్మరం చేస్తోంది. దీంతో..ఇప్పుడు ముంబాయిలో థర్డ్ వేవ్ మొదలైందనే హెచ్చరికలతో ప్రజలు సైతం కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications