ఢిల్లీలో 500 లగ్జరీ కార్లను దొంగిలించారు: హైదరాబాద్ ముఠానే కీలకం, విమానాల్లోనే ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దాదాపు 500 లగ్జరీ కార్లను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనాల్లో హైదరాబాదుకు చెందిన ముఠా కీలకంగా వ్యవహరించడం గమనార్హం.
ఉత్తర ఢిల్లీలోని నందనగ్రి ప్రాంతంలో నివాసం ఉంటున్న సఫ్రుద్దీన్(29) అనే వ్యక్తి హైదరాబాద్ నగరానికి చెందిన తన ముఠా సభ్యులతో కలిసి లగ్జరీ కార్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చి, పని పూర్తయిన తర్వాత మళ్లీ విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయేది ఈ ముఠా.

ల్యాప్‌టాప్, ఇతర హైటెక్ గాడ్జెట్లు వీరి ఆయుధాలు. వీటి ద్వారా కార్ల సాప్ట్‌వేర్ జీపీఎస్‌ను కేంద్రీకృత లాకింగ్ సిస్టంలోకి ఎంటరై కారును కొట్టేస్తారు. విచారణ సందర్భంగా పలు విషయాలను సఫ్రుద్దీన్ వెల్లడించాడు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం 100 లగ్జరీ కార్లను దొంగిలించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. వీటిని పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు అమ్మేస్తామని వివరించాడు.
కాగా, జూన్ 5న సఫ్రుద్దీన్, అతని నలుగురు సహచరులు వివేక్ విహార్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఈ గ్యాంగ్‌లోని ననూర్ మహ్మద్‌ను కాల్చిచంపిన పోలీసులు.. మరో నిందితుడు రవి కుల్దీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సప్రూద్దీన్‌ను అరెస్ట్ చేశారు. కాగా, సప్రూద్దీన్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా గతంలో పోలీసు శాఖ ప్రకటించడం గమనార్హం.












Click it and Unblock the Notifications