ఇంటర్వ్యూ కోసం పిలిచి.. యువతిపై గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటర్వ్యూకి పిలిచి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మథురకు చెందిన 19 ఏళ్ల యువతి వారం రోజుల క్రితం ఉద్యోగం కోసం ఢిల్లీకి చేరుకున్నారు. లజ్‌పత్‌నగర్‌లోని ఆమె సోదరి ఇంటిలో ఉంటున్న ఆమెకు.. నిందితుల్లో ఒకరైన జుబైర్ ఇంటర్నెట్ ద్వారా పరిచయమయ్యాడు.
లక్ష్మీనగర్‌లోని ఓ సంస్థకు తాను అధిపతినని, మంచి జీతం వచ్చేలా ఓ ఉద్యోగం ఇప్పిస్తానని అతడు నమ్మబలికాడు. ఇంటర్వ్యూ కోసం లక్ష్మీనగర్‌కు రమ్మని పిలిచాడు. దీంతో మంగళవారం అక్కడకు వచ్చిన ఆమెను ఓ భవనంలోని నాలుగో అంతస్తుకు తీసుకెళ్లాడు.

అంతకు ముందుగానే మరో ఇద్దరు నిందితులు షాహిద్, అమ్జాద్ అక్కడకు చేరుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు వెల్లడించారు.
అనంతరం బాధితురాలిని లక్ష్మీనగర్ మెట్రోస్టేషన్ దగ్గర వదిలి, వారు ముగ్గురూ పరారయ్యారని పోలీసులు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications