బ్యాంకులకు మూడురోజుల వరుస సెలవులు: సామాన్యులకు కష్టాలే!
కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. వరుసగా మూడురోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తుండడం సామాన్యులను కలవరపెడుతోంది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో వరుసగా మూడురోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తుండడం సామాన్యులను కలవరపెడుతోంది.
వచ్చే శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాధారణ సెలవు, సోమవారం షిల్లార్-ఉల్-నబీ ముస్లీంల పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. మొత్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు దినాలు వస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు జరిగి నేటికి నెలరోజులు కావస్తున్నా.. కరెన్సీ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

కరెన్సీ కష్టాలు ఇంకా తీవ్రంగా వెంటాడుతున్న తరుణంలో.. బ్యాంకులకు వరుస సెలవులు సామాన్యుల కష్టాలను మరింత పెంచేవిగా మారాయి. ఓవైపు పనిచేయని ఏటీఎంలు, బ్యాంకుల ముందు చాంతాడంతా 'క్యూ'లతో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న సామాన్యులకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి తయారవనుంది.
వరుస సెలవుల కారణంగా గురు, శుక్రవారాల్లో బ్యాంకుల పనిగంటలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సామాన్యులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications