క్రిస్మస్: ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం, షార్ట్ సర్యూట్ తో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగరంలో విద్యుత్ షార్ట్ సర్యూట్ తో ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదనహం అయ్యారు. నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా బయటకురాలేని కుటుంబ సభ్యులు క్రిస్మస్ పండుగ వేడుకల సంతోషం నుంచి బయటకురాక ముందే మరణించారు.

బెంగళూరు నగరంలోని పాత మద్రాసు రోడ్డులోని టిన్ ఫ్యాక్టరీ సమీపంలోని ఉదయనగర్ లో మురుగన్, సోఫియా దంపతులు నివాసం ఉంటున్నారు. మురుగన్, సోఫియా దంపతులకు ఫ్లోరా అనే కుమారుడు ఉన్నాడు.

Three died by short circut near tin factory in Bengaluru

బుధవారం వేకువ జామున మురుగన్, సోఫియా దంపతులు కుమారుడు ఫ్లోరాతో కలిసి ఇంటిలో నిద్రపోతున్న సమయంలో ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఆ సందర్బంలో మురుగన్, సోఫియా దంపతులు కుమారుడు ఫ్లోరాను తీసుకుని బయటకురావడానికి విఫలయత్నం చేశారు.

ఇల్లు మొత్తం మంటలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారు. మంటల్లో మురుగన్, సోఫియా దంపతులతో పాటు వారి కుమారుడు ఫ్లోరా సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసి ముగ్గురి మృతదేహాలను బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three died by short circut near tin factory in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి