మందుపాతర పేల్చిన మావోలు: బాలికతోపాటు ముగ్గురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పేలుళ్లతో తెగబడ్డారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పేలుళ్లతో తెగబడ్డారు. నారాయణపూర్ జిల్లా తుంనార్ వద్ద బుధవారం రాత్రి భద్రతా బలగాలే లక్ష్యంగా అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ని పేల్చారు.
ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు.

మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు ఉండగా, మరో ముగ్గురు మహిళలు, ఓ రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారని ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపారు. నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications