చిన్నారిపై కామాంధుడి రేప్: పేరెంట్స్‌పై దాడి, తల్లి మృతి

లక్నో/ హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. ఈటా జిల్లాలోని దేహత్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. మంగళవారంనాడు పోలీసులు ఈ విషయం చెపిపారు.

స్వీట్లు ఇస్తానని బుజ్జగించి బాలికను తన వెంట తీసుకుని వెళ్లి ఆమెపై ఆ బాలుడు సోమవారం సాయంత్రం అత్యాచారం చేసినట్లు దేహత్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ పదం సింగ్ చెప్పారు.

బాలుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం అలిగఢ్ ఆస్పత్రికి పంపించారు.

 Three-year-old raped by teenager in UP

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోటూరుపాడులో దారుణం జరిగింది. ఓ కసాయి కొడుకు మద్యం మత్తులో కన్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి రమణమ్మ అక్కడికక్కడే మరణించింది.

తండ్రి చిన్నయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. నిందితుడు నారాయణణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+