గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురి అరెస్టు: విద్యార్థినిపై రేప్
ముంబై/ సేలం: ఓ టీనేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులును ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సల్మాన్, షాబాద్, ఇర్ఫాన్‌లుగా గుర్తించినట్లు చేంబర్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దిలీప్ రౌత్ చెప్పారు.
ప్రధాన నిందితుడు సల్మాన్‌కు అమ్మాయితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెను సల్మాన్ ఆర్‌సిఎఫ్ ప్రాంతంలోని షాబాజ్ ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటకు చెప్తే పరువు తీస్తామని వారు అమ్మాయిని బెదిరించారు.

ఆ తర్వాత ఆ ఇద్దరితో పాటు ఇర్ఫాన్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. చివరికి ఆమె విషయమంతా తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారిని పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఇదిలావుంటే, 19 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. సోమవారం ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. బస్సు డ్రైవర్ అయిన నిందితుడు చీకట్లో పారిపోయాడు. నమక్కల్ జిల్లాలో విద్యార్థిని బికాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.












Click it and Unblock the Notifications