ప్రజల్ని కలిపి ఉంచడం అసాధ్యం: కొత్త రాష్ట్రాలపై ప్రణబ్

పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా ప్రజలందరినీ ఒకేచోట కలిపి ఉంచడం సాధ్యం కాదని ప్రణబ్ అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రణబ్ ఢిల్లీలో జరిగిన నిఘావర్గాల అధికారుల సమావేశంలో మాట్లాడారు.
కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికి గురువారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి రెండు వారాలు బస చేస్తున్నారు. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకే వస్తారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును నిరసిస్తున్న సమైక్యవాదుల నుండి నిరసనల వ్యక్తమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రణబ్ పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భధ్రతా ఏర్పాట్లపై బుధవారం రిహార్సల్స్ నిర్వహించారు. ప్రణబ్ కార్యక్రమాలకు ప్రత్యేక హెలికాప్టర్ వినియోగిస్తారు.












Click it and Unblock the Notifications