ఐదుగురు బీజేపీ, ముగ్గురు టీఎంసీ కార్యకర్తల మృతి : జెండా విషయంలో బెంగాల్‌లో గొడవ

కోల్ కతా : బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పట్టు సాధిస్తున్న బీజేపీ .. టీఎంసీ కార్యకర్తలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో భారీగా భద్రతా బలగాలను మొహరించిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ఘర్షణలో 8 మంది కార్యకర్తలు చనిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది.

144 సెక్షన్ కూడా ..

144 సెక్షన్ కూడా ..

ఉత్తర 24 పరగణ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో 144 సెక్షన్ కూడా విధించారు. తాజాగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బీజేపీకి చెందిన ఐదుగురు కార్యకర్తలను టీఎంసీ నేతలు మట్టుబెట్టారని బీజేపీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పరగణ జిల్లాలో జరిగిన ఘర్షనలో టీఎంసీకి చెందిన ముగ్గురు చనిపోయారని ఆ పార్టీ నేత ఒకరు వివరించారు. సందేశాకాలి నియోజకవర్గంలో హట్కాజీలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలకు మధ్య శనివారం ఘర్షణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీకి చెందిన 18 మంది ఆఛూకీ కనిపించడం లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ దీనిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

మీరే .. కాదు మీరూ ...

మీరే .. కాదు మీరూ ...

ఈ ఘటనకు టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ముకుల్ రాయ్. రాష్ట్రంలో హింస చెలరేగేందేకు కారణం ఆమెనని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరిస్తామని పేర్కొన్నారు. హట్కాజీలో బీజేపీ జెండాను టీఎంసీ కార్యకర్తలు తీసేయడంతో గొడవ మొదలైందని స్థానికులు చెప్తున్నారు. తర్వాత ఒకరికొరు మాటలయుధ్దం కాస్త .. భౌతికదాడుల వరకు వెళ్లిందని తెలిపారు. ఇంతలో కొందరు కాల్పులు జరపడంతో ఇరు పార్టీలకు చెందినవారికి తూటాలు వెళ్లి చనిపోయారని పేర్కొన్నారు. దీంతో అప్పటికే సందేశాకాలి వచ్చిన ముఖ్యనేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

బీజేపీ నేతుల ముకుల్ రాయ్, సయంతాన్ బసు, లాకెట్ ఛటర్జీ, జగన్నాథ్ సర్కార్, అర్జున్ సింగ్, దులాల్ బార్, ఠాకూర్ వంటి నేతలు నిన్న ఉదయమే సందేశాకాలి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గొడవ పెద్దదై .. 8 మంది ప్రాణాలు తీసేందుకు దారితీసింది. ఈ ఘర్షణలో 18 మంది టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారని .. వారిని అక్కడున్న నదిలో తోయడం ఏంటని టీఎంసీ నేత ప్రశ్నించారు. ఈ ఘటనను కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఖండించారు. చనిపోయిన బీజేపీ నేతల హత్యలకు మమతా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+