పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.

ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని ఫుల్బరి ప్రాంతంలో చోటు చేసుకుంది. అతను లోకల్ క్లబ్‌లో ఓ పూజకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. సంఘటన స్థలం నుంచి ఓ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్య జరిగిన సమయంలో అక్కడే రాష్ట్ర మంత్రి రత్నఘోష్ ఉన్నారు. రత్నఘోష్ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ సమయంలో హత్య గావింపబడిన ఎమ్మెల్యే సత్యజిత్ ఆమె (మంత్రి) పక్కనే నిలబడ్డారు.












Click it and Unblock the Notifications