స్పీకర్ నోటీసులు: నేడు డెడ్ లైన్: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం పళని ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది టీటీవీ దినకరన్ గ్రూప్ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల భవిష్యత్తు నేటితో (గురువారం) తేలిపోనుంది. తమిళనాడు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు గురువారం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది.

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టు వార్నింగ్: రూ. లక్ష ఫైన్, తమాషానా, శశికళకు !

తమిళనాడు ప్రభుత్వం, సొంత పార్టీ మీద ఎందుకు తిరుగుబాటు చేశారు, పార్టీ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ సమాధానం చెప్పాలంటూ ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ టీటీవీ దినకరన్ గ్రూప్ లోని రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

TN CM meets discusses with minister about Dinakaran faction mlas

ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చెయ్యడంతో గతంలో రెండు సార్లు నోటీసులు జారీ చేసినా దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మాత్రం సమాధానం ఇవ్వలేదు.

తమిళనాడు సీఎం, స్పీకర్ భేటీ: రెబల్ ఎమ్మెల్యేలపై వేటు ? అసెంబ్లీలో అడుగుపెట్టకుండా !

మూడో సారి నోటీసులు జారీ చేసిన స్పీకర్ ధనపాల్ ప్రభుత్వం, పార్టీ మీద ఎందుకు తిరుగుబాటు చేశారు అంటూ గరువారం (సెప్టెంబర్ 14వ తేదీ)లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. గురువారం లోపు దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వకుంటే వారి మీద స్పీకర్ ధనపాల్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గురువారం తమిళనాడు ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సెక్రటేరియట్ లో మంత్రులు అందిరితో సమావేశం అయ్యి టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేద్దాం అంటూ చర్చించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As today is the last date for Dinakaran faction MLAs to give reply for Speaker's notice, CM Edappadi Palanisamy to meet and discuss with Ministers in secretariat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X