మళ్లీ మొదటి నుంచి: తమిళనాడు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో కొత్త జడ్జీ నియామకం
తమిళనాడులో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ మరో మలుపుతీసుకుంది. ఈ కేసుపై జూన్ 14న వాదనలు జరుగగా ఇద్దరు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసును మరో కోర్టుకు బదిలీ చేయడం కుదరదని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.... ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారణ చేసేందుకు కొత్తగా మూడో జడ్జి అయిన జస్టిస్ సత్యనారాయణ్‌ను నియమించింది.

తీర్పును వెలువరించడంలో జాప్యం చేస్తున్న కోర్టుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు మందలించింది. కోర్టుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయరాదంటూ హెచ్చరించింది. ఇది చాలా సీరియస్ విషయమని, ఈ కేసుకు మొదటి ప్రాధాన్యతగా పరిగణించి త్వరగా విచారణ చేయాలని ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్ వికాస్ సింగ్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు నియమించిన జడ్జి గురించి వాట్సాప్‌లో ప్రజలకు తెలిసిపోయిందని వికాస్ సింగ్ ఆరోపించారు. అయితే కోర్టు వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా వెళ్లదని స్పష్టం చేసింది .
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications