చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ ఎన్నికలు: 'అమ్మ వరాలు' అదిరాయ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం మరింతగా వేడెక్కింది. పార్టీ అధినేతలు ఓ ప్రక్క ప్రచారంతో హోరెత్తిస్తుంటే, మరోవైపు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేశారు.

ఈరోడ్ జిల్లాలోని పెరుందురాయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో జయలలిత ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళ ప్రజలు దైవంగా భావించే పెరియార్‌ జన్మించిన జిల్లాలో దీనిని విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు.

ఇంతటిలో ఈ హామీలు ఆగవని, రాబోయే రోజుల్లో మరిన్ని హామీలను ఉంటాయని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మెనిఫెస్టో అనంతరం తొలి కాపీని లోక్‌సభ డిప్యూటి స్పీకర్ ఎం.తంబిదొరై అందుకున్నారు. అనంతరం ఎన్నికల మెనిఫెస్టో తొలి కాపీలను పార్టీ యువ కార్యకర్తలకు అందజేశారు.

ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మే 16వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

TN Polls: Jayalalithaa Releases Manifesto for Assembly Elections

ఎన్నికల మేనిఫెస్ట్‌లో ముఖ్యంశాలు:

* రిటైల్‌ వ్యాపారంలో ఎఫ్‌డీఐలకు అనుమతి నిరాకరణ
* 10, 12 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయంతో
* వివిధ గృహ నిర్మాణ పథకాల కింద 10లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి హామీ
* రైతు రుణమాఫీ
* ప్రతీ రెండు నెలలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
* రేషన్‌కార్డు కలిగిన వారికి ఏటా రూ.500తో సంక్రాంతి బహుమతి కూపన్లు
* ద్విచక్రవాహన కొనుగోళ్లలో మహిళలకు 50శాతం రాయితీ
* గర్భిణిల ప్రసవ ఖర్చులకు రూ.18వేలు
* మత్స్యకారులకు ప్రత్యేక గృహాలు
* కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ
* కోతలు లేని నిరంతర విద్యుత్‌
* అమ్మ బ్యాంకింగ్‌ కార్డు
* 2016-21 మధ్య రైతులకు రూ.40 వేల కోట్ల రుణాలు

English summary
AIADMK general secretary and Chief Minister J Jayalalithaa on Thursday released the much-awaited manifesto for May 16 Assembly elections. She released it at a public meeting at Perundurai in Erode district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X