చైనాకు కౌంటర్‌గా భారత్ 17 టన్నెల్స్ నిర్మాణం, మంచు కురిసినా భయంలేదు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చైనాకు కౌంటర్ ఇచ్చే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. భారత్ - చైనా సరిహద్దు వెంబడి 17 హైవే టన్నెల్స్ నిర్మాణానికి నడుం బిగించింది.

చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!

 ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్

ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్

సరిహద్దుల్లో ఇప్పటికే చేపట్టిన ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్ (ఐసీబీఆర్)కు అదనంగా వీటిని నిర్మించాలని యోచిస్తోంది. మంచు విపరీతంగా కురిసే సమయంలో రోడ్లు మూసుకుపోవడంతో లాజిస్టిక్స్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది.

 డొక్లాంతో సంబంధాలు నిలిచిపోనున్నాయి, నివారణకు

డొక్లాంతో సంబంధాలు నిలిచిపోనున్నాయి, నివారణకు

ముఖ్యంగా వ్యూహాత్మక ప్రదేశమైన డొక్లాంతో సంబంధాలు నిలిచిపోతున్నాయి. దీనిని నివారించి ఆర్మీకి నిత్యం రవాణా అందుబాటులో ఉండేందుకు వీటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. టన్నెల్స్ నిర్మిస్తే మంచు కురిసినా ఇబ్బంది ఉండదు.

 టన్నెల్స్ నిర్మాణంతో

టన్నెల్స్ నిర్మాణంతో

టన్నెల్స్ నిర్మాణంతో నిర్వహణ వ్యయం కూడా విపరీతంగా తగ్గుతుందని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల సమినార్‌లో పేర్కొన్నారు.

 చైనా సరిహద్దుల్లో దూకుడు

చైనా సరిహద్దుల్లో దూకుడు

కాగా, ఇటీవల చైనా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. డొక్లామ్ ఇష్యూ, బ్రహ్మపుత్ర నదీ జలాలు తరలించేందుకు సొరంగం, రోడ్డు నిర్మాణాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bid to ensure all-weather connectivity along the Line of Actual Control (LAC) bordering China, India is planning to construct 17 tunnels in addition to the ongoing work on the strategically crucial India- China Border Roads (ICBR).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి