పేలిపోతున్న ఏసీలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్‌..

రానురాను ప్రజలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. కొన్నేళ్లక్రితం నగరాలు, కార్యాలయాల్లో, ధనికుల ఇంట్లో మాత్రమే ఏసీలు కనిపించేవి. ఇప్పుడు గ్రామాల్లోకి కూడా ఏసీలు వచ్చేశాయి. ఏటేటా ఎండ తీవ్రత దృష్ట్యా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఏసీలకు అలవాటుపడిపోయారు. అయితే తాజాగా ఓ ఇంట్లో ఏసీ పేలిపోయిన ఘటన సంచలనంగా మారింది. హరియాణాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఏసీ పేలిపోయి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో పాటు కుక్క కూడా మృతి చెందింది.

హరియాణాలోని ఫరీదాబాద్‌ లో ఘోర విషాదం జరిగింది. ఓ ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు చనిపోయారు. అర్ధరాత్రి 1:30 గంటలకు ఏసీ పేలడంతో కుటుంబ సభ్యులు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు పెంపుడు కుక్క కూడా చనిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో సచిన్ కపూర్, ఆయన సతీమణి రింకూ, కూతురు సుజన్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే వేరే గదిలో నిద్రిస్తున్న కుమారుడు కిటికీ నుంచి కిందకు దూకేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ పేలుడు సంభవించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఏసీలు ఎందుకు పేలుతాయి..?

ఏసీలు పేలడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడం లేదా లో మెయింటెనెన్స్ కారణంగా జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఏసీ లోని కంప్రెషర్ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. అది ఎక్కువ సమయం పనిచేసి, బ్రేక్ లేకుండా కొనసాగితే వేడి ఎక్కువగా వస్తుంది. ఈ వేడిమి పెరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Tragedy in Faridabad How to Prevent Deadly AC Explosions

అలాగే ఓల్డ్ లేదా దెబ్బతిన్న పైపుల ద్వారా రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ గ్యాస్ మంటలు చెలరేగి పేలుడుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా పాత ఏసీల్లో కనిపిస్తుంది. ఇక ఏసీలోని ఎలక్ట్రికల్ వైర్లను సరిగ్గా జత చేయకపోయినా లేదా తగిన మార్పిడి లేకుండా ఉపయోగించితే షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దాంతోపాటు ఏసీలోని ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు, మురికి, దుమ్ము వల్ల యూనిట్ సరిగ్గా పనిచేయకపోయినా.. అలాగే విద్యుత్ సరఫరాలో వేగంగా పెరుగుదల లేదా తగ్గుదల ఏర్పడినా ఇలాంటి సంఘటనలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

ఏసీలను ఉపయోగించేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఫిల్టర్లను మార్చడం, అవుట్ డోర్ యూనిట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవడం, కంప్రెషర్ చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేయడం, ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవడం చేయాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+