విషాదం : గ్రానైట్ క్వారీ కూలి ప‌ది మంది మృతి..

మిజోరం రాష్ట్రంలో తీవ్ర విషాదం నెల‌కొంది. రెమల్ తుపాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వెస్ట్‌బెంగాల్‌, ఈశాన్య‌రాష్ట్రాల్లో తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఈదురు గాలులు, భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక‌, నేటితో (మే28న) ఈ తుపాన్ తీరం దాటింది. ఈ తుపాన్ తీరం దాటుతూ మిజోరం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విషాదాన్ని నింపింది. రాష్ట్రంలోని ఐజ్వాల్‌లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గ్రానైట్ క్వారీ కూలిపోయింది. దీంతో ఈ ప్ర‌మాదంలో ప‌దిమంది చిక్కుకుని మృతిచెందారు. ఐజ్వాల్ సిటీకి దక్షాణాన ఉన్న మెల్తుమ్, హ్లిమెన్ ల సరిహద్దులోని రాళ్ల క్వారీ కూలిపోయిన ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ధాటికి చుట్టుపక్కలున్న ఇళ్లు కూడా ధ్వంసమైయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం మే28న ఉదయం 6 గంటలకు సంబ‌వించిన‌ట్లు తెలుస్తోంది. ప‌లువురు శిథిలాల కింద చిక్కుకుని ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గని శిథిలాల నుంచి ఇప్ప‌టికే మృతదేహాలను వెలికి తీశారు. అయినపట్టికీ చాలామంది ఇంకా కూలిపోయిన రాళ్ల క్వారీలో చిక్కుకుని ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. వాళ్ల కోసం పోలీసులు, రెస్క్యూ టీంలు రక్షణ చర్యలు చేప‌ట్టారు. మిజోరంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వ‌ర్షాలే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు అనుకుంటున్నారు. కుండ‌పోత వ‌ర్షం కారణంగా కొండచర్యలు కూడా విరిగిపడ్డాయి. చనిపోయిన వారిలో ముగ్గురు మిజోలు కాని వారు ఉన్నట్లు స‌మాచారం. ఇంకా ఈ ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్షం స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లిగిస్తోంద‌ని అధికారులు అంటున్నారు. మృతుల వివ‌రాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Tragedy Ten killed in granite quarry collapse in Mizoram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+